ఒక్క సినిమాతో తిరిగి ఇంటికెళ్ళిపోతుందనుకున్నారు చంద్రముఖి లో నయనతారను చూసిన చాలామంది. ఆ సినిమాలో అంత ఇంపార్టెంట్ రోల్ కాకపోయినప్పటికి రజనీ పక్కన నటించేసరికి క్రేజ్ బాగానే వచ్చేసింది. దాంతో హీరోయిన్లకు కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉండే ఈ సినిమా పరిశ్రమలో దశాబ్దం పైగా టాప్ హీరోయిన్‌గా నిలబడటం మామూలు విషయం కాదు. అయితే నయనతార ఈ విషయంలో తనేంటో ఎవరూ ఊహించని విధంగా ప్రూవ్ చేసుకుంది. యంగ్ హీరోస్ నుండి స్టార్ హీరోస్ వరకు ప్రతి ఒక్క హీరో తననే కావాలని డిమాండ్ చేయడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమనే చెప్పాలి. అంతేకాదు లేడీ ఓరియంటెడ్ సినిమాలన్నా కూడా డైరెక్టర్స్ ఫస్ట్ ఛాయిస్ నయనతారే. అయితే పోయిన సంవత్సరం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన నయన్ కు ఈ సంవత్సరం మాత్రం అసలు కలిసి రాలేదు.  


సంక్రాంతికి చేసిన విశ్వాసం అజిత్ ఇమేజ్ పుణ్యమా అని కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది కానీ తెలుగులో మాత్రం ఈ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత హారర్ జానర్ లో డిఫరెంట్ గా డ్యూయల్ రోల్ లో చేసిన ఐరా మరీ దారుణంగా రెండు భాషల్లోనూ డిజాస్టర్ మూవీగా మిగిలింది. అందుకే ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో కూడా లైట్ తీసుకున్నారు. తరువాత శివ కార్తికేయన్ తో చేసిన మిస్టర్ లోకల్ కూడా డిజాస్టర్ గానే నిలిచింది. దాంతో ఇదే సినిమాని తెలుగులో డబ్బింగ్ చేయాలన్న ఆలోచన కూడా ఎవరికి రాలేదు. ఇప్పుడు విడుదలకు రెడీగా ఉన్న నాలుగో సినిమా కొలైయుతీర్ కాలం కోర్టు చిక్కుల్లో పడి ఆగిపోయింది. 


ఈ సినిమా హిందీ వెర్షన్ ఖామోష్ లో తమన్నా చేస్తే మూడు రోజులకె సర్దుకొని ఇంటికెళ్ళిపోయింది. ఇక నయన్ నెక్స్ట్ సినిమా చిరుతో మొదటిసారి చేసిన సైరానే. ఇది పెద్ద బ్రేక్ అవుతుందని చాలా నమ్మకంతో ఉంది నయన్. ఎలాగూ ఈ సినిమా తమిళ్ కన్నడ లో కూడా రిలీజవుతాయి కాబట్టి మళ్ళి హిట్ కొట్టే ఛాన్సుంది. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా నయన్ కు ఆఫర్స్ వస్తున్నప్పటికీ కంటిన్యూగా  మరో రెండు ఫ్లాపులు పడితే పరిస్థితి ఊహించడం కష్టం. అందుకే చిరు మీదే ఆశలన్ని పెట్టుకొని కూర్చుంది. మరి సైరా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: