సౌత్ లో హిందీ, తెలుగు, తమిళం..అన్నీ భాషలలోను బిగ్ షో బిగ్ బాస్ మీద బారీ అంచనాలుంటున్న విషయం అందరికి తెలిసిందే. ఇక టీవీ రియాలిటీ షో బిగ్ బాస్-3 పైన తెలుగులో కూడా భారీ ఆసక్తే ఉంది.  ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో మూడో సీజన్ ప్రారంభం కానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.  రీసెంట్ గా 'బిగ్ బాస్ 3 కమింగ్ సూన్' అంటూ ఒక శాంపిల్ వీడియో విడుదల చేశారు. తాజాగా స్టార్ మా బిగ్ బాస్ 3 ప్రోమోను రిలీజ్ చేశారు. 


ఈ ప్రోమోలో స్వామీజీ ఒక చోట కూర్చొని ప్రవచనం ఇస్తూ "మనసు ఓ కోతి లాంటిది. మరి అలాంటి మనసున్న మనుషులు ఓ ఇంట్లో చేరితే.. మమకారంతో వెటకారంతో వారిని ఏకతాటిపైకి తెచ్చేది ఎవరు? అధికారంతో నడిపేది ఎవరు? ఆ ఇంట్లో కొత్త ఉత్సాహాన్ని నింపే శక్తి గల వ్యక్తి ఎవరు?" అంటు ఇంట్రో ఇస్తూ ఉంటే కింగ్ అక్కినేని నాగార్జున మొహం కనిపించకుండా నడుస్తూ ఉంటారు.  ఒక పిల్లవాడు బిగ్ బాస్ 3 కమింగ్ సూన్ పోస్టర్ లు గోడకు అంటిస్తూ ఉంటే..దాని పక్కగా నాగ్ ఆ పోస్టర్ ను వేలితో చూపిస్తూ స్టైల్ గా నడుస్తూ వెళతాడు. ఫైనల్ టచ్ అన్నట్టుగా రోడ్ లో నడుస్తూ అలా వెనక్కు తిరుగుతాడు.


ఈ ప్రోమోతో అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించే విషయం అధికారికంగా కన్ఫాం అయిపొయింది.  అయితే కంటెస్టెంట్ల వివరాలు.. ఎప్పుడు ప్రారంభం అవుతుందనే వివరాలు ఇంకా  వెల్లడించలేదు.  మొదటి సీజన్లో జూనియర్ ఎన్టీఆర్.. రెండవ సీజన్లో నాని హోస్టులుగా వ్యవహరించారు.  ఇప్పుడు మూడవ సీజన్ హోస్టుగా నాగ్ ఎలా మెప్పిస్తారో వేచి చూడాలి. మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటి షోస్ కు హోస్ట్ గా పని చేసి విజయవంతం చేసిన అనుభవం ఉంది కాబట్టి నాగ్ ఈ కొత్త రోల్ లో అదరగొడతాడనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ ప్రోమోలో నాగ్ గెటప్ అపరిచితుడు ని పోలి ఉండటం హైలెట్‌గా అనిపిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: