పూరీ జగన్నాథ్ ద్వారా అదాశర్మ తెలుగు ప్రేక్షకులకు 'హార్ట్ ఎటాక్' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన విషయం తెల్సిందే. ఆ సినిమా నిరాశ పర్చడంతో తెలుగులో అదాశర్మకు స్టార్ స్టేటస్ దక్కలేదు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికి ఫేమస్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. అయితేనేమి సినిమాల కంటే సోషల్ మీడియాతోనే అదా ఎక్కువగా పాపులరయింది. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో, వీడియోలతో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూ వస్తోంది. ఇక ప్రస్తుతం అదా ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటించడానికి రెడీ అవుతోంది.


హాలీవుడ్ వెబ్ సిరీస్ 'ది హాలీడే' కోసం అదాశర్మ ఒక కొత్తరకమైన హెయిర్ స్టైల్ ను ట్రై చేసింది. మూడు రంగుల హెయిర్ తో ఆకట్టుకుంటోంది. పర్పల్.. పింక్.. ఆరెంజ్ కలర్స్ జట్టుతో అదాశర్మ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా ఇలాంట్ కొత్త తరహా హెయిర్ స్టైల్ కు అమ్మాయిలు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఈ హెయిర్ స్టైల్ అదాశర్మకు క్రేజ్ ను తెచ్చి పెట్టింది. దాంతో ఈమె ఆ హెయిర్ స్టైల్ పై కాపీ రైట్స్ నావి అంటూ సరదాగా ఒక పోస్ట్ చేసింది.


నేను 'ది హాలీడే' సిరీస్ కోసం చేసుకున్న హెయిర్ స్టైల్ ఇది. అమ్మాయిలు ఎవరు దీన్ని ట్రై చేయకూడదు. ఈ హెయిర్ స్టైల్ పై పూర్తి కాపీ రైట్స్ నావే అంటూ సోషల్ మీడియాలో ఫన్నీగా అమ్మాయిలకు వార్నింగ్ ఇచ్చింది. మొత్తానికి ట్రెండ్ ను ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు స్టైల్స్ ను కొత్తగా ట్రై చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న అదాశర్మ నటిగా మాత్రం ట్రెండ్ ను సెట్ చేయలేకపోతోంది. మరి ది హాలీడే వెబ్ సిరీస్ తో అయినా అదాశర్మకు సక్సెస్ వస్తుందేమో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: