హాలీవుడ్ లో నటించాలని అందరూ నటులు కలలు కంటుంటారు.హాలీవుడ్ లో కొంతమంది ఎంత కష్టపడినా వారిని అదృష్టం వరించదు. కాని కొందరిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది.అలాంటి వారి లిస్టులో కి మన సౌత్ ఇండియా కి సంబంధించిన ఒక ముద్దుగుమ్మ  చేరింది.

విలక్షణ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలో కి అడుగు పెట్టిన శ్రుతి హాసన్ మొదట ఫ్లాప్ లతో ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది.కాని పవర్ స్టార్ తో చేసిన గబ్బర్ సింగ్ తో ఆ ముద్రను చెరిపేసి తనదైన దూకుడు తో సినిమాలను చేస్తూ టాప్ హీరోయిన్ రేసులో కొనసాగింది.

తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ట్రేడ్ స్టోన్ అనే అమెరికన్ టీవీ సీరీస్ లో ఒక అసాసిన్ పాత్రలో పోషించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.వెండి తెర పై తనదైన ముద్ర వేసిన ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్ లో ఏమేర రాణించనున్నదో  తెలుసుకోవడానికి కొద్ది రోజులు వేచి చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: