అరుంధతి సినిమా వచ్చి పదేళ్ళు దాటింది.  అరుంధతి అనగానే అనుష్క, పశుపతిగా చేసిన సోనూసూద్ గుర్తుకు వస్తారు.  ఇద్దరి నటన అమోఘం.  ఒకరకంగా చెప్పాలి అంటే.. సోనూసూద్ నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది.  అరుంధతి భళా అనిపించింది.  


2009 జనవరి 16 వ తేదీన రిలీజైన ఈ సినిమా అప్పట్లో రికార్డులు బద్దలు కొట్టింది.  ఒకరకంగా చెప్పాలి అంటే ప్రజలను భయపెట్టింది.  కోడిరామ కృష్ణ దర్శకత్వం సూపర్బ్ అని చెప్పొచ్చు.   అరుంధతి సీక్వెల్ సినిమా ఇప్పటి వరకు తీసే ప్రయత్నం చేసే ప్రయత్నం చేయలేదు మల్లెమాల ప్రొడక్షన్స్ సంస్థ. 


ఇదిలా ఉంటె పదేళ్ల తరువాత అరుంధతి 2 తీస్తున్నట్టు ప్రకటించారు.  అయితే, ఇది తీస్తున్నది మల్లెమాల ప్రొడక్షన్ సంస్థ కాదు.  శ్రీ శంఖ చక్ర ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతున్నది.  కోటి తూముల ఈ సినిమాను నిర్మించబోతున్నారు.  ఇక ఇందులో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా చేస్తోంది.  


అరుంధతి 2 ను భారీ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిస్తున్నారు.  హాలీవుడ్ కు చెందిన ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ దీనికోసం పనిచేస్తోందట.  ఇక ఈ సినిమా కోసం పాయల్ రాజ్ పుత్ కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ వంటివి నేర్చుకుంటోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: