టాలీవుడ్ లో గతంలో ఎప్పుడు చూడని ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చిన సినిమా కేరాఫ్ కంచెరపాలెం. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచే కాదు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు అందుకోవడం ఈ సినిమాకే చెల్లింది. సహజమైన వాతావరణంలో, నటనే అలవాటు లేని కొత్త ఆర్టిస్టులతో దర్శకుడు వెంకటేష్ మహా చేసిన ప్రయత్నానికి నిర్మాత ప్రవీణ పరుచూరి సంకల్పం తోడై మొత్తానికి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది.


సురేష్ బాబు లాంటి పెద్ద బ్యానర్ అండదండలు అందుకున్న సినిమాగా మరో క్రెడిట్ కూడా దక్కించుకుంది. ఇప్పుడీ టీమ్ మరోసారి కలసి మరో అద్భుతమైన సినిమా కి సన్నాహాలు చేస్తున్నారని లేటెస్ట్ న్యూస్. నిర్మాత దర్శకుడు మళ్ళీ రిపీట్ అవుతున్నారు. ఈసారి ఎలాంటి కథను ఎంచుకుంటారా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలగడం సహజం. ఇక రీసెంట్‌గా ఈ సినిమాకోసం క్యాస్టింగ్ కాల్ కు పిలుపు ఇచ్చారు. తెలుగు బాగా మాట్లాడగలిగే ముగ్గురు అమ్మాయిల కోసం వేట మొదలుపెట్టారు చిత్ర బృందం. పరబాషా హీరోయిన్లను తీసుకోకుండా ఇలా తెలుగు వాళ్ళకోసం అవకాశాన్ని కల్పించడం మంచి  ప్రయత్నం.  
 
 
ఇక ప్రణాళికలు చూస్తుంటే ఈసారి కూడా కంచెరపాలెం తరహాలో న్యాచురల్ కాన్సెప్ట్ ఏదో ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. క్యాస్టింగ్ ఫైనల్ అయ్యాక పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. ఇందులో కొత్త వాళ్ళతో పాటు కొందరు సీనియర్ హాస్యనటులను కూడా తీసుకునే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అంతా ఓకే అయ్యాక అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. ఏదేమైనా ఇలాంటి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ స్టాండర్ట్స్ పెరుగుతాయనడంలో సందేహం ఏమాత్రం లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: