కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ హీరోగా అట్లీ డైరక్షన్ లో వస్తున్న సినిమాకు టైటిల్ గా బిజిల్ అని పెట్టారు. స్పోర్ట్స్ డ్రామాతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ న్య్ జూన్ 22న విజయ్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేశారు. ఏ.జి.ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ అదిరిపోయింది.


విజయ్ డబుల్ రోల్ లో ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఒక రోల్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపిస్తుండగా రెండోది మధ్య వయస్కుడి పాత్రలో కనిపిస్తున్నాడు. అంటే తండ్రి కొడుకులుగా విజయ్ నటిస్తున్నాడన్నమాట. టైటిల్ కూడా బిజిల్ అంటూ సర్ ప్రైజ్ ఇచ్చారు. అట్లీతో తెరి, మెర్సల్ సినిమాల తర్వాత విజయ్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  


నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ ఇయర్ దీపావళికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ అంతా సంబరపడేలా బిజిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంది. పోస్టర్ లో రెండు పాత్రల్లో విజయ్ ఇంటెన్స్ లుక్ అదరగొట్టింది. సో ఈసారి దీవాళికి విజయ్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా అని చెప్పొచ్చు. ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో వివేక్, జాకీ ష్రాఫ్, ఆనంద్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


శుక్రవారం సాయంత్రం ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా శనివారం మరో లుక్ కూడా వదులుతున్నారని తెలుస్తుంది. విజయ్ కు తెలుగులో పెద్దగా మార్కెట్ లేకున్నా అతని సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి. మరి బిజిల్ తో తెలుగులో కూడా సత్తా చాటుతాడేమో చూడాలి. డైరక్టర్ అట్లీ సినిమా అంటే యూనివర్సల్ కాన్సెప్ట్ అని ఫిక్స్ అయ్యారు. మరి బిజిల్ ఎలా ఉంటుంది అన్నది సినిమా వస్తేనే కాని చెప్పలేం. 



మరింత సమాచారం తెలుసుకోండి: