మెగాస్టార్ చిరంజీవి.. అసలు పేరు శివశంకర వర ప్రసాద్.  పునాది రాళ్లు సినిమాతో ఆయనకు ఈ పేరు సెట్ అయ్యింది.  చదువు పూర్తయ్యాక సినిమాల్లో వేషం కోసం మద్రాస్ వెళ్లి అక్కడ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యారు.  అయితే, ఫిలిం ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన చిరు అవకాశాల కోసం చాలా ట్రై చేశారు.  


చివరకు ఎలాగైతేనేం అవకాశం దక్కింది.  సుధాకర్ చేయాల్సిన పునాది రాళ్లు సినిమా కొన్ని కారణాల వలన ఆయన చేయలేకపోయారు.  ఆ అవకాశం చిరంజీవికి దక్కింది.  ఈ సినిమా రిలీజ్ కావడం చిరంజీవిగా ఆయన పేరు పడటం.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిగా ఎదగడం అలా అలా జరిగిపోయాయి.  


అయితే, శివశంకర వర ప్రసాద్ చిరంజీవిగా ఎలా మారాడు అనే దానిపై మెగాస్టార్ ఓ సమయంలో క్లారిటీ ఇచ్చాడు.  ఓ రోజు కలలో రాములవారి గుడికి వెళ్లినట్టు.. అక్కడ దణ్ణం పెట్టుకుంటున్న సమయంలో వెనకనుంచి చిరంజీవి వెళదాం అనడంతో వెనక్కి తిరిగి చూస్తే.. వెనుక ఎవరు లేరట.  


ఇదే విషయాన్ని మెగాస్టార్ తన తల్లికి చెప్పాడు.  వెంటనే ఆమె తన కుమారుడికి చిరంజీవి అనే పేరు పెట్టింది.  ఈ పేరుతోనే మెగాస్టార్ చిరంజీవిగా మారిపోయాడు.  ఇండస్ట్రీలో అనతికాలంలోనే అవలీలగా ఎదిగిపోయాడు చిరంజీవి.  దట్ ఈజ్ మెగాస్టార్.  


మరింత సమాచారం తెలుసుకోండి: