తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేసి నిజమైన బంగారు తెలంగాణగా మార్చడానికి నిన్న ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ వార్తలు అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ లో కూడ వచ్చాయి అంటే ఆ ప్రాజెక్ట్ వార్తలు ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో అర్ధం అవుతుంది. అనేక మంది రాజకీయ ప్రముఖులు పాల్గొన్న ఈ ప్రాజెక్ట్ ఆవిష్కరణ ఘట్టంలో తాము కూడ ఉన్నాము అంటూ నాగార్జున రవితేజా ప్రకాష్ రాజ్ లు చేసిన ట్విట్స్ పై సెటైర్లు పడుతున్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభ సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ను అభినందిస్తూ నాగార్జన రవితేజ ప్రకాష్ రాజ్ వెన్నెల కిషోర్ లతో పాటు అనేకమంది సినిమా సెలెబ్రెటీలు తమ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేసారు. ఇప్పుడు ఈ విషయమై వారికి అనుకోని తలనొప్పులు తెచ్చి పెట్టింది. 

కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో చరిత్ర సృష్టిస్తూ ప్రభుత్వాన్ని జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినప్పుడు ఒక్క మాట కూడ మాట్లాడని వీరంతా ఇప్పుడు కెసిఆర్ ప్రాపకం కోసం ఇప్పుడు ఇలా కాళేశ్వరాన్ని అడ్డు పెట్టుకుని ప్రశంసలు కిరిపించారా అంటూ సెటైర్లు పడుతున్నాయి. అంతేకాదు ఆంధ్రప్రాంతానికి చెందిన వీరంతా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అధికార మార్పు పై స్పందించకుండా ఇప్పుడు కాళేశ్వరం పై స్పందించడంలో వారి స్వార్ధ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయా అంటూ మరికొందరు ఘాటైన విమర్శలు చేస్తున్నారు.

సాధారణంగా రాజకీయాలకు చాల దూరంగా ఉండే నాగార్జున రవితేజలు ఇలా ప్రత్యేకంగా పనికట్టుకుని కెసిఆర్ పై కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సాకుగా పెట్టుకుని కురిపించిన ప్రశంసలు వారి స్వార్దాన్ని సూచిస్తున్నాయి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా ఒక మంచి పనిపై స్పందించాలని నాగ్ రవితేజలు చేసిన ప్రయత్నం పై ఇప్పుడు ఇలా రివర్స్ నెగిటివ్ కామెంట్స్ రావడం అత్యంత ఆశ్చర్యకరం..   



మరింత సమాచారం తెలుసుకోండి: