బాహుబలికి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ వచ్చిందో అందరికీ తెలుసు. ఈ సినిమా నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించారు. ఇండియాలోనే ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచిపోయింది. అయితే ఈ సినిమా నిర్మాతల కారణంగా ప్రఖ్యాత నటుడు విజయ్ సేతుపతి విడుదల కాకుండా ఆగిపోయింది. వివరాల్లో కెళితే..

 

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన నూతన చిత్రం 'సింధూబాద్'. అంజలి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కె.ప్రొడక్షన్స్ పతాకంపై రాజరాజన్ ఈ సినిమాను నిర్మించారు. శుక్రవారం నాడు విడుదల కావాల్సిన ఈ సినిమా ఓ వివాదం కారణంగా ఆగిపోయింది.'బాహుబలి' సినిమాను తమిళంలో రాజరాజన్ విడుదల చేశారు. మంచి వసూళ్లను కూడా రాబట్టింది. కానీ తనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని రాజరాజన్ చెల్లించలేదని 'బాహుబలి' నిర్మాత శోభూ యార్లగడ్డ కోర్టుని ఆశ్రయించారు.

 

రాజరాజన్ నిర్మించిన 'సింధూబాద్', 'ఎన్నైనోకి పాయుమ్ తోటా' సినిమాలపై కేసు వేశారు. ఈ నేపధ్యంలో హైదరాబాద్ హైకోర్టు రెండు సినిమాల విడుదలైన స్టే విధించింది. అయినప్పటికీ రాజరాజన్ తన సహనిర్మాతలతో కలిసి సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నించారు. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.

 

అయితే థియేటర్ యజమానులు దీనికి అంగీకరించలేదు. సినిమా విడుదలైన ఎటువంటి అభ్యంతరం లేదని డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ నుండి సర్టిఫికేట్ తీసుకొస్తేనే స్క్రీనింగ్ వేస్తామని చెప్పారు. సినిమాపై స్టే ఉన్న కారణంగా సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదని డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ స్పష్టం చేయడంతో సినిమా విడుదల ఆగిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: