అల్లు అర్జున్ అన్న అల్లు బాబి గురించి ఈమధ్య మీడియాలో రకరకాల గాసిప్పులు వచ్చాయి. ఈ గాసిప్పులు వల్ల జరిగిన డ్యామేజ్ ని కంట్రోల్ చేయడానికి అల్లు బాబి రంగంలోకి దిగి ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్.

తెలుస్తున్న సమాచారం మేరకు అరవింద్ పెద్ద కొడుకు బాబి నీలిమను సుమారు ఒక దశాబ్దం క్రితం పెళ్ళి చేసుకుని 2016లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరికి 10 సంవత్సరాల వయసు ఉన్న కూతురు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమ్మాయి పేరు అన్విత అని తెలుస్తోంది.

ఈమధ్య అరవింద్ ఇంట్లో జరిగిన అన్విత పుట్టినరోజుకు నీలిమ వచ్చినట్లు తెలుస్తోంది. దీనితో బాబి నీలిమ విడిపోయినా తమ మధ్య స్నేహబంధం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో అల్లు బాబి మరో పెళ్లి చేసుకున్నాడు అంటూ వస్తున్న వార్తల పై స్పందించి ఆ గాసిప్పులకు చెక్ పెట్టాడు. 

తాను రెండవ పెళ్లి చేసుకున్న వార్త నిజమేనని క్లారిటీ ఇస్తూ తన పెళ్ళికి అందరి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ తన కొత్త జీవితం బాగుండాలి అని తాను కోరుకుంటున్నాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు తాను ఎప్పటి నుంచో స్నేహం కొనసాగిస్తున్న నీలుషా ను పెళ్లి చేసుకున్నానని క్లారిటీ ఇస్తూ వారి పెళ్ళికి సంభందించిన ఫోటోలను కూడ షేర్ చేసాడు. దీనితో ఇప్పుడు ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాలలో సంచలనం గా మారడమే కాకుండా ఇప్పటివరకు అల్లు బాబి వ్యక్తిగత జీవితం పై వస్తున్న  గాసిప్పులకు క్లారిటీ  వచ్చింది..



మరింత సమాచారం తెలుసుకోండి: