స్వీటీ అనుష్క ఇమేజ్ ను డబుల్ చేసిన సినిమా అరుంధతి. అప్పటివరకు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా మాత్రమే చేసే అనుష్క డిఫరెంట్ రోల్స్ చేస్తుందని ప్రూవ్ చేసిన సినిమా అది. కోడి రామకృష్ణ డైరక్షన్ లో శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా అప్పట్లో ఓ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమా కథ, కథనాలు, గ్రాఫిక్స్ అన్ని చక్కగా కుదరడంతో ఆడియెన్స్ కు భలే థ్రిల్ అనిపించింది.


ఆ సినిమా తర్వాత అనుష్క ఇలాంటి సాహసాలు ఎన్నో చేసింది. రుద్రమదేవి సినిమాలో కూడా నటించి మెప్పించింది. అయితే అరుంధతి సీక్వల్ సినిమా అప్పట్లో ఆలోచన ఉన్నా ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. కోడి రామకృష్ణ మరణం తర్వాత అరుంధతి 2 మీద ఆశలు వదులుకున్నారు. కాని అరుంధతి 2 సెట్స్ మీదకు వెళ్లనుంది.


అయితే ఈసారి అరునధతి పాత్రలో అనుష్క కాదు ఆమె ప్లేస్ లో పాయల్ రాజ్ పుత్ నటిస్తుంది. ఆరెక్స్ 100 సినిమాతో కుర్రాళ్ల హృదయాలను దోచేసిన పాయల్ కచ్చితంగా అనుష్క తర్వాత అంతటి అందగత్తె అని చెప్పొచ్చు. మరి అలాంటి అందగత్తె పసుప్తి కంట్లో పడకుండా ఉంటుందా.. ఈ సీక్వల్ అరుంధతి తరహాలో ఉంటుందట. అయితే ఇది ఆ కథ సీక్వల్ గా వస్తుందా లేక కొత్త కథతో వస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.


తెలుగు, తమిళ, హింది భాషల్లో శ్రీ శంఖుచక్ర ఫిలింస్ బ్యానర్ లో కోటి తూములు అరుంధతి 2 నిర్మిస్తున్నారు. చారిత్రిక కథతో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారని తెలుస్తుంది. మరి అరుంధతి లానే ఈ పార్ట్ 2 కూడా అలరిస్తుందా లేదా అన్నది చూడాలి. పాయల్ రాజ్ పుత్ కు మాత్రం ఇది లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు.   



మరింత సమాచారం తెలుసుకోండి: