తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించి తన అందంతో యూత్ మి మెస్మరైజ్ చేసిన ఓ బ్యూటీ ఇపుడు షాకింగ్ న్యూస్ అయిపోయింది. ఆమెకు ఇంకా ఎంతో కెరీర్ ఉందనుకుంటే అపుడే ఎంగేజ్మెంట్, పెళ్ళి ఇలాంటి న్యూస్ తో ఫ్యాన్స్ కి గట్టి షాక్ తగుతులోంది. అదేంటి అపుడేనా అంటూ యువ గుండెలు చికాకు పడుతున్నాయి.


అయితే ఇదంతా వట్టి రూమర్ అంటోంది ఆ బ్యూటీ రెజీనా. తమిళనాడుకి చెందిన ఓ నేషనల్ మ్యాగజైన్ రెజీనా నిశ్చితార్ధం గురించి వార్తలు ప్రచురించడంతో ఇది కాస్త వైరల్ అయింది. దీని మీద మండిపడిన రెజీనా అవన్ని తప్పుడు రాతలు అంటోంది. ఈ నెల 13న చెన్నైలో కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో రెజీనా రహస్యంగా నిశ్చితార్ధం చేసుకుందని రాసుకొచ్చారు. ఈ ఏడాది చివర్లో పెళ్లి కూడా చేసుకోబోతుందని అన్నారు. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎట్టకేలకు రెజీనా స్పందించింది.


ఈ వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పింది. అసలు ఇలాంటి వార్తలు ఎక్కడ నుండి పుట్టుకొస్తాయో అర్ధం కాదని, ఇలాంటివి విన్నప్పుడు చాలా చిరాకేస్తుందని.. తనకు నిజంగా పెళ్లి ఆలోచన వస్తే స్వయంగా ప్రకటిస్తానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో 'కసడదబర'తో పాటు తెలుగులో 'ఎవరు' చిత్రంలో నటిస్తోంది. ఎంతో ఫ్యూచర్ ఉన్న రెజీనా మీద ఇలా పని గట్టుకుని వార్తలు వండి వడ్డించడం అంటే దారుణమే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: