తెలుగులో సూపర్ హిట్ క్రేజీలకు డిమాండ్ ఎక్కువ. ఒక సినిమా హిట్ అయ్యి ఆ సినిమాలో నటించిన జోడీకి క్రేజ్ వస్తే చాలు ఇక ఆ కాంబినేషన్ రిపీట్ చేసేందుకే ప్రయత్నిస్తారు దర్శక నిర్మాతలు. అలా చాలాసార్లు హీరో, హీరోయిన్స్ రిపీట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ, రష్మిక కాంబో రిపీట్ అవుతుంది.


ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక సెకండ్ సినిమా గీతా గోవిందం చేసింది. ఆ సినిమాలో విజయ్ దేవరకొండతో జతకట్టింది. ఇద్దరి జోడీకి మంచి క్రేజ్ రాగా మళ్లీ అదే జంటని రిపీట్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి చేస్తున్న సినిమా డియర్ కామ్రేడ్. ఆ సినిమా కూడా వచ్చేల నెలలో రిలీజ్ కాబోతుంది.


విజయ్, రష్మికల క్రేజీ జంటకు కంబైండ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇద్దరు జంట చాలా బాగుంటుంది. అంతేకాదు ఇద్దరు కలిసి నటిస్తే సినిమా సూపర్ హిట్ అన్నట్టే అంటూ నమ్మకం ఉంది. వరుస హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న విజయ్ డియర్ కామ్రేడ్ తో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. రష్మిక కూడా డియర్ కామ్రేడ్ మీద చాలా హోప్స్ పెట్టుకుంది. 


ఎలా లేదన్నా సరే ఈ పెయిర్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. డియర్ కామ్రేడ్ తర్వాత క్రాంతి మాధవ్ బ్రేక, ఆనంద్ అన్నామలైతో హీరో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ రెండు సినిమాల తర్వాత తను చేసే సినిమాకు మళ్లీ రష్మికను రిపీట్ చేయాలని చూస్తున్నాడు విజయ్. ఇలా వరుసగా సినిమాలు చేస్తుంటే రియల్ లైఫ్ లో కూడా వీరి మధ్య రిలేషన్ ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్న రష్మిక అది విజయ్ దేవరకొండ మీద ఎఫెక్షన్ వల్లే అన్న రూమర్స్ ఉన్నాయి. ఇప్పుడు అది నిజం చేసే పనిలో వారిద్దరు ఉన్నారని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: