తమిళ స్టార్ 'ఇళయదళపతి' విజయ్ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.  ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కి మరోసారి సంతోషం కలిగించే విషయాన్ని అందించారు.  ఆయన నటిస్తున్న కొత్త మూవీ #విజయ్63 ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.  ఈ మూవీకి అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.  సినిమాకు 'బిజిల్' అనే టైటిల్ ను లాక్ చేసింది ఫిలిం యూనిట్.  ఫస్ట్ లుక్ పోస్టర్లో విజయ్ డబుల్ రోల్ లో కనిపిస్తున్నాడు. 

ఆ మద్య మెర్సల్ తెలుగు లో అదిరింది మూవీలో త్రిపాత్రాభినయంలో కనిపించిన విజయ్ ఈ మూవీలో డబుల్ రోల్ కనిపించబోతున్న విషయం తెలుసుకొని ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఈ పోస్టర్ చూస్తుంట క్లాస్, మాస్ కలిసి ఉన్నట్లు అనిపిస్తుంది.   ఆ మొద్దుకు ఉన్న కత్తిని చూస్తే మాంచి మాసాలా ఫైట్ కు రెడీగా ఉన్నారు అన్నట్టే ఉంది.  ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది.  సెకండ్ లుక్ ను శుక్రవారం రాత్రి 12 గంటలకు విడుదల చేస్తారని ఫిలిం మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు.

ఈ మూవీలో స్టార్ హీరోయిన్ నయన తార నటిస్తుంది. మరో ముఖ్య పాత్రల్లో వివేక్,  జాకీ ష్రాఫ్, ఆనంద్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఎజీఎస్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ సినిమా తెలుగు వెర్షన్ కు ఎలాంటి టైటిల్ ఎంచుకుంటారో వేచి చూడాలి.  ఈ సినిమాను ఈ ఏడాది దీపావళి పండుగకు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: