బాహుబలి2 తర్వాత యువ దర్శకుడు సజిత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా రూ.250 కోట్ల బడ్జెట్ తో ‘సాహూ’ మూవీ రూపొందుతుంది. ప్రభాస్ నటిస్తున్న ‘సాహూ’పై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ‘సాహూ’ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు.

ఆగష్టు 15న సాహో చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది.  ఈ మద్యనే సాహూ టీజర్ రిలీజ్ చేశారు.  చేసిన ఆరు గంటలకే రికార్డుల మోత మోగించింది.  ఇక సినీ సెలబ్రెటీలపై దారుణమైన కామెంట్స్ చేస్తూ ఎప్పుడూ వివాదాల్లో ఉండే బాలీవుడ్ హీరో కమల్ ఆర్ ఖాన్ ఆ మద్య సాహూ మూవీపై దారుమైన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రూ. 250 కోట్ల భారీ బడ్జెట్ తో సాహో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ కావడం ఖాయం. అతిపెద్ద డిజాస్టర్స్ లో సాహూ ఒకటిగా నిలుస్తుంది అంటూ కామెంట్ చేశాడు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ మరికొంత మంది సెలబ్రెటీలు కమల్ ఆర్ ఖాన్ పై సీరియస్ అయ్యారు. 


తాజాగా కమల్ ఆర్ ఖాన్ ఒక్కసారే యూటర్న్ తీసుకున్నారు..ప్రభాస్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు.  బాహుబలి 2 తర్వాత ప్రభాస్ మరో ప్రభంజనం సృష్టించబోతున్నాడని..సాహూ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలుస్తుందని అన్నాడు. అంతే కాదు ప్రభాస్ బాలీవుడ్ లో కూడా తిరుగులేని స్టార్ గా అవతరిస్తాడు. సౌత్ నుంచి ఓ హీరో బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎదగడం అభినందించదగ్గ విషయం అని కమల్ ప్రశంసించాడు. అయితే ఇటీవల రిలీజ్ అయిన సాహూ టీజర్ చూసిన తర్వాత తన అభిప్రాయం మార్చుకున్నట్లు కనిపిస్తుంది. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: