పాతికేళ్ల క్రితం వచ్చిన శివ సినిమా తర్వాత అదే తరహాలో బాలీవుడ్ లో ఓ తెలుగు సినిమా సందడి కనిపిస్తుంది. బాలీవుడ్ లో రీమేక్ అయిన తెలుగు సినిమాల్లో అప్పటి శివ తర్వాత ఈమధ్యనే వచ్చిన అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ అదరగొడుతుంది. సందీప్ వంగ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ, షాలిని పాండే నటించిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో సంచలన విజయం అందుకుంది. ఇదే సినిమాను హిందిలో షాహిద్ కపూర్, కియరా అద్వానిలతో రీమేక్ చేశాడు సందీప్ వంగ.


శుక్రవారం రిలీజైన కబీర్ సింగ్ అక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుందని తెలుస్తుంది. అయితే కొందరు మాత్రం సినిమా తెలుగు అర్జున్ రెడ్డికి మక్కీకి మక్కీ దించాడని అంటున్నారు. రాం గోపాల్ వర్మ శివ సినిమా తెలుగులో హిట్ అవగా బాలీవుడ్ లో కూడా రీమేక్ చేశాడు. లీడ్ కాస్ట్ తప్ప మిగతా వాళ్లను అక్కడ వాళ్లతోనే తీశాడు వర్మ. కాని సందీప్ వన కబీర్ సింగ్ కు మొత్తం కొత్త కాస్టింగ్ తో చేశాడు.   


తెలుగు దర్శకుడు ఇక్కడ హిట్ కొట్టిన సినిమాను మళ్లీ అతని డైరక్షన్ లోనే అక్కడ కూడా సేమ్ రిజల్ట్ పొందడం శివ తర్వాత అర్జున్ రెడ్డితోనే సాధ్యమంది. అది కూడా ఆర్జివి తర్వాత సందీప్ వంగ వల్లే అని చెప్పొచ్చు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే శివ సినిమా ఆర్జివికి మొదటి సినిమా.. అర్జున్ రెడ్డి సందీప్ కు తొలి సినిమా అవడమే.. మరి డైరక్టర్ పనితనం చూసి బాలీవుడ్ ఆఫర్లు వస్తాయేమో చూడాలి.  


అయితే తనకు వచ్చే బాలీవుడ్ ఆఫర్లు కన్నా సందీప్ మాత్రం తెలుగు సినిమాలే చేసేలా ఉన్నాడు. తన తర్వాత సినిమా మహేష్ తో ఉంటుందని అనుకోగా మహేష్ డేట్స్ బిజీగా ఉండటం వల్ల మళ్లీ అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండతోనే సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: