ఆస్కార్ ఒడిసి పట్టుకున్న భారతీయ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్. ఈయన సంగీతమే కాకుండా సినిమాలకు కథలు రాయడం కూడా మొదలుపెట్టారు. ఆ మధ్య ఒకసారి తనకి రచనలో ఇంట్రెస్ట్ ఉందని చెప్పిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు రెహమాన్ ఒక సినిమా తీసే ఆలోచనలో ఉన్నాడట. ఇండస్ట్రీ లో  డైరెక్టర్లు హీరోలుగా మారడం, హీరోలు డైరెక్టర్లు హీరోలుగా మారడం చూస్తుంటాం.

 

కానీ ఒక సంగీత దర్శకుడు రచయితగా మారడం, అది కూడా సినిమా కి కథ రాయడం ఇదే మొదటిసారేమో. ఏ ఆర్ రెహమాన్ లాంటి దిగ్గజ సంగీత దర్శకులు సినిమా తీస్తున్నారంటే ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకి " 99 సాంగ్స్" అనే పేరును ఖరారు చేసారు. ఇది ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ అట.

 

ఈ పాటలని ప్రముఖ గాయనీ గాయకులు పాడుతున్నారు. అందులో సిడ్ శ్రీరామ్ కూడా ‘జ్వాలాముఖి’ అనే పాటను పాడుతున్నారు.దానికి సంబంధించి ఆయన రిహార్సల్స్ చేస్తున్న వీడియో ఒకదాన్ని రహమాన్ తన ఇన్స్టాలో షేర్ చేశారు. అప్పటి నుండి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆస్కార్ పొందిన సంగీత దర్శకుడి కలం నుండి వెలువడే కథ ఎలా ఉంటుందోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అది సంగీతానికి సంబంధించిన కథ కావడంతో ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది.

 

ఈ సినిమా ఏక కాలంలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానుంది.  ఈ సినిమాను విశ్వేష్ కృష్ణమూర్తి డైరెక్ట్ చేస్తున్నారు. మరి ఇప్పటివరకు తన మ్యూజిక్ తో యావత్ ప్రేక్షకులను అలరించిన రహమాన్..నిర్మాణ రంగంలో ఎలా అదరగొడతాడో..రచయిత గా ఎంత సక్సెస్ అవుతాడో చూడాలి. సంగీతానికి సంబంధించిన సినిమా కావడంతో నటీనటులని ఏరి కోరి ఎంచుకుంటున్నారట. ఈ సినిమాలో ఎవరైనా గాయనీ గాయకులు నటిస్తారేమో ఇంకా తెలిసి రాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: