ఈ మద్య కొన్ని సినిమాలు హిట్టో..ఫ్లాపో ఒక హీరో నటించాల్సింది మరో హీరో నటిస్తున్నారు.  ఆ సినిమా హిట్ అయితే తన కెరీర్ లో మంచి సినిమా మిస్ అయ్యిందని భావిస్తున్నారు.  అదే ఆ సినిమా ఫ్లాప్ అయితే బతికిపోయాన్రా బాబూ అంటే సంతోషిస్తున్నారు.  ఈ మద్య కమెడియన్లుగా వచ్చిన వారు హీరోలుగా మారుతున్న విషయం తెలిసిందే.  తాజాగా ‘మల్లేశం’సినిమాలో హీరోగా కనిపించారు ప్రియదర్శి.  


నిన్న రిలీజ్ అయిన మల్లేశం మూవీకి మంచి హిట్ టాక్ వచ్చింది. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు రాజ్ ఆర్ ప్రస్తావించారు. ఆ మద్య ఓ సందర్భంలో చింతకింది మల్లేశం గురించి విన్నాను..ఆయను కలవాలని ఉత్సాహంతో వెళ్లి నా ఆలోచనను చెప్పాను. ఆయన నుంచి అనుమతి తీసుకుని స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నాను. అయితే ఈ సినిమాకు ఎంత నేచురాలిటీ ఉంటే అంత సక్సెస్ అవుతుందని భావించాను. అందుకోసం మొదట 'మల్లేశం' పాత్రకి నానీ గానీ .. విజయ్ దేవరకొండగాని నటిస్తే అద్భుతంగా ఉంటుందని భావించాను. కానీ మూడేళ్ల వరకూ వాళ్ల కాల్షీట్స్ లేవని తెలిసింది. 


ఆ సమయంలోనే ప్రియదర్శి పేరు వినిపించింది. వెంటనే కథ ఆయనకు వినిపించాను..ఎంతో ఇంప్రెస్ అయిన ప్రియదర్శ తప్పకుండా చేద్దామని చెప్పాడు.  అయితే అన్ని సమకూరిన తర్వాతనే సినిమా దర్శకత్వం చేయడం మంచిదనే భావన వచ్చింది. దాంతో నేనే రంగంలోకి దిగాను .. ఇప్పుడు ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ ఆనందాన్ని కలిగిస్తోంది అని చెప్పుకొచ్చాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: