యంగ్ హీరో శర్వానంద్ థాయ్ లాండ్ లో ప్రమాదానికి గురైన తరువాత హైదరాబాద్ తీసుకు వచ్చి అతడి భుజానికి తగిలిన గాయాలకు సుమారు 11 గంటల సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. నెమ్మదిగా కోలుకుంటున్న శర్వానంద్ ను నిన్న సాయంత్రం హాస్పటల్ నుండి డిశ్చార్జ్ చేసారు. 

దీనితో అతడి అభిమానులతో పాటు శర్వానంద్ తో సినిమాలు తీస్తున్న నిర్మాతలు కూడ కొంత తెరిపిన పడ్డారు. ఇంత వరకు విషయం బాగానే ఉన్నా శర్వానంద్ హాస్పటల్ నుండి డిశ్చార్జ్ కి సంబంధించి డాక్టర్లు అతడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడిన విషయాలను ఒక వీడియోగా చేసి శర్వానంద్ తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేసాడు. 

అయితే ఈవిషయం కొంతమందికి వేరే విధంగా అర్ధం అవుతూ శర్వా పై సెటైర్లు పడేలా చేస్తోంది. సాధారణంగా ఇలాంటి హాస్పటల్ బులిటెన్స్ లేదంటే వైద్యులు మీడియాకు ఇచ్చే లీకులు ప్రముఖ రాజకీయ నాయకుల ఆరోగ్య విషయమై న్యూస్ ఛానల్స్ ప్రసారం చేస్తూ ఉంటాయి. 

అయితే ఆ స్థాయిలో శర్వానంద్ ను ఎలివేట్ చేస్తూ అతడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి పై అతడు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి డాక్టర్లు చెప్పిన సలహాలను ఒక వీడియోగా చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టడం కొంతమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనితో ఈ వీడియోను చూసిన కొంతమంది ఇది అంతా శర్వానంద్ కు సింపతి క్రియేట్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలా లేకుంటే శర్వానంద్ తో సినిమాలు తీస్తున్న దర్శక నిర్మాతలకు ధైర్యం కలిగించే ఎత్తుగడలా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ సందడి చేస్తున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: