ఎన్నికల పరాజయం తరువాత పవన్ కళ్యాణ్ ను జూలై మొదటి వారంలో అమెరికాలోని వాషింగ్టన్ లో జరగబోతున్న తానా మహాసభలకు అతిధిగా పిలవడం వెనుక ఒక ముఖ్య కారణం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఆపార్టీకి సంబంధించిన అత్యంత కీలక నేతను అతిధిగా పిలవాలని ముందుగానే తానా సంస్థ నిర్వాహకులు అనుకున్నట్లు టాక్.

ఆ తరువాత ఎన్నికల ఫలితాలలో వచ్చిన తేడాతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుండి ఏ కీలక నాయకుడు అందుబాటులో లేకపోవడంతో కనీసం పవన్ కళ్యాణ్ ను రప్పించి అయినా ఆ లోటును పూడ్చాలని జరిగిన ప్రయత్నాలలో భాగమే పవన్ కు అందిన ఆహ్వానం అని అంటున్నారు. వాస్తవానికి పవన్ తానా మహాసభలకు హాజరు అయ్యే ఉద్దేశ్యం లేకపోయినా ఒక ప్రముఖ ఛానల్ అధినేతను రంగంలోకి దింపి పవన్ ను ఒప్పించినట్లు సమాచారం.

అంతేకాదు చివరి నిముషంలో పవన్ మళ్ళీ తానా సంస్థకు హ్యాండ్ ఇవ్వకుండా పవన్ ను దగ్గర ఉండి తీసుకు వచ్చే భాద్యతను కూడ ఆ ఛానల్ యజమానికి తానా సంస్థ నిర్వాహకులు అప్పగించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇలాంటి మహాసభలు జరిగినప్పుడు పాపులారిటీ ఉన్న వ్యక్తులను అతిధులుగా తీసుకురావడానికి అమెరికాలోని తెలుగు సంస్థలు చాల భారీ మొత్తాలను ఖర్చు పెడుతూ ఉంటాయి.

పవన్ ఇప్పుడు ఇంత ఒత్తిడితో తానా మహాసభలకు  వెళ్ళడం వెనుక మరొక కారణం ఉంది అన్నప్రచారం కూడ జరుగుతోంది. త్వరలో పవన్ తన ‘జనసేన’ కోసం ఒక పత్రికను స్థాపించే ఆలోచనలు చేస్తున్నాడు. ప్రస్థుత పరిస్థితులలో పత్రిక నిర్వాహణ అంటే కోట్ల పెట్టుబడి అవసరం కాబట్టి దీనినిమిత్తం కూడ పవన్ తన ప్రయత్నాలు కొనసాగిస్తూ తన ఆలోచనలకు సహకరించే వ్యక్తుల కోసం ఈ తానా మహాసభలను ఉపయోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: