రాజకీయాలు అంటే తనకు తెలియవు అంటూ అనేకసార్లు ఓపెన్ గా చెప్పిన మహేష్ చేసిన ట్విట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో కలకలం సృష్టించడం హాట్ న్యూస్ గా మారింది. నిన్న జరిగిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా మహేష్ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు శుభాకాంక్షలు తెలియ చేస్తూ ట్విట్ చేసాడు. 

ఈ ప్రాజెక్ట్ ఒక ఇంజనీరింగ్ అద్భుతం అంటూ ప్రశంసలు కూడ కురిపించాడు. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ ట్విట్ టిఆర్ఎస్ పార్టీ లోని మరో కీలక నేత హరీష్ రావ్ అభిమానులకు కొద్దిగా అసహనాన్ని కలిగించినట్లు తెలుస్తోంది. 

దీనితో కొందరు హరీష్ రావ్ అభిమానులు మహేష్ ట్విట్ పై స్పందిస్తూ ‘అన్నా ఈ ప్రాజెక్ట్ కోసం చాల కష్టపడ్డ హరీష్ రావ్ ను కూడ నీట్విట్ లో చేరిస్తే బాగుండేది కదా’ అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి నిన్నటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి హరీష్ రావ్ రాకపోవడం వెనుక కారణం ఏమిటి అంటూ ఇప్పటికే మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థుతులలో మహేష్ ట్విట్ ను ఆధారంగా చేసుకుని కొందరు హరీష్ రావ్ అభిమానులు మహేష్ ను అడ్డుగా పెట్టుకుని చేస్తున్న కామెంట్స్  రాజకీయ వర్గాలలో హాట్ న్యూస్ గా మారింది. అసలు రాజకీయాలు అంటే తనకు తెలియదు అనే మహేష్ పెట్టిన ట్విట్ సృష్టించిన కలకలం యాధృశ్చికమా లేకుంటే వ్యూహాత్మకమా అంటూ ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: