టాలీవుడ్ లో యువతకు, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిన దర్శకుల్లో ఒకరు శేఖర్ కమ్ముల.  హ్యాపీడేస్ సినిమాతో యూత్ ని బాగా ఆకట్టుకున్న ఆయన తర్వాత లీడర్ లాంటి సినిమాతో రాజకీయాలు ఇలా ఉండాలని చూపించారు.  ఆ తర్వాత కొన్ని ఫ్యామిలీ, ప్రేమ కథా సినిమాలు తీసిన శేఖర్ కమ్ముల ఇటీవల వరుణ్ తేజ్, సాయిపల్లవి కాంబినేషన్ లో ‘ఫిదా’సినిమాతో తెలుగు ప్రేక్షకులను నిజంగా ఫిదా చేశారు. లవ్, రొమాన్స్, ఎమోషన్ ఏదైనా ఆయన సినిమాల్లో చాలా నేచురల్ గా ఉంటుంది.  


ఫిదా సినిమా తర్వాత మళ్లీ ఆ తరహా సినిమా తీయాలా లేదా లవ్, రొమాంటిక్ సినిమా తీయాల అన్న విషయంలో కొంత కాలం డైలమాలో ఉన్నట్లు సమాచారం.  ఈ సందర్భంలోనే గతంలో ‘హ్యాపీడేస్’తరహాలో అంతా కొత్త వాళ్లతో ఓ సినిమా తీయాలని భావించారట. ఏషియన్ గ్రూప్ సంస్థ నిర్మాణంలో శేఖర్ కమ్ముల ఆ మూవీ ప్రారంభించారు. కొంతభాగం షూటింగ్ తర్వాత అవుట్ పుట్ శేఖర్ కమ్ములకు అస్సలు నచ్చలేదట..దాంతో ఆ ప్రాజెక్ట్ కి గుడ్ బాయ్ చెప్పినట్లు సమాచారం. 


ఇంతలోనే అక్కినేని నాగ చైతన్యతో ఓ సినిమా కమిట్ కావడం..ప్రకటన చేయడం చక చకా అయిపోయాయి.  దాంతో తాను ప్రారంభించిన కొత్త ప్రాజెక్ట్ అటకెక్కిసింది. నాగ చైతన్యతో సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: