ఈ మ‌ధ్య  అమలాపాల్ కోలీవుడ్లో నటించిన ‘ఆడై’చిత్రాన్ని  తెలుగు లో ‘ఆమె’ పేరుతో అనువ‌దిస్తున్న విష‌యం విదితమే. ఈ సినిమా టీజర్ను సైతం ఇటీవ‌లే రిలీజ్ చేసారు.  విడుద‌లైన కొద్ది గంట‌ల‌లోనే సామాజిక మీడియాలో వైరల్ గా మారింది  ఈ టీజర్.

 

అందుకు ప్ర‌ధాన‌ కారణం ఇందులో అమలాపాల్ నగ్నంగా ద‌ర్శ‌న‌మివ్వ‌డ‌మే.  ఒక సెలబ్రెటీ అయి ఉండి ఇలాంటి నగ్న ప్రదర్శ ఏంటంటూ. ఈ టీజర్ పై నెటిజ‌న్లు ట్రోలింగ్ ఆరంభించారు. విడుద‌లైన కొద్ది గంట‌ల‌లోనే సామాజిక మీడియాలో మిలియన్ వ్యూస్ సొంతం చేసుకొని, వైరల్ గా మారింది  ఈ టీజర్.

 

అయితే  ఆమె సహజ నటనకు హేట్సాఫ్ అన్న‌వారూ లేక‌పోలేదు. పాత్ర లో ఆమె జీవించిన‌ట్టే క‌నిపిస్తోంద‌న్న ప్ర‌శంస‌లూ అందుకుంటోంది.  దింతో సినిమాపై  అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే ఈ మూవీలో ఇటువంటి షాట్స్ చాలానే ఉం డ‌టంతో సెన్సార్ తీవ్ర భ్యంత‌రాలు వ్య‌క్తం చేసింద‌ట‌.

 

చిత్రంలో క‌నిపిస్తున్న న‌గ్న సీన్ల‌ను తొలగించడమో, డీఫోకస్ చేయడమో, వేరే వాటితో రీప్లేస్ చేయడమో చేయాలని చెప్పారట. దాంతో ఈసినిమాకి ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేశారట. ఈ చిత్రంపై అనేక ఆశ‌లు పెట్టుకున్న అమ‌లా పాల్‌కు ఇది పెద్ద షాకే. మరి నెటిజన్లు ఈ సీన్లు చూసి ఫిదా అయినవారు వాటిని తొలగిస్తే ఎంతవరకు మూవీని ఆదరిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: