పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన సమయంలో చాలామంది ఇండస్ట్రీకి చెందినవారు అభిమానులు బాధ పడ్డారు. ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు వేల ఓడిపోవడంతో జనసేన పార్టీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు రావడంతో పవన్ కళ్యాణ్ మీద ప్రత్యర్థి పార్టీ నాయకులు కార్యకర్తలు రకరకాలుగా కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు దూరం అయిపోతున్నారు యూటర్న్ తీసుకుని సినిమాలు చేస్తున్నారని ఇలా అనేక రకాలుగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న పరిస్థితులలో పవన్ కళ్యాణ్..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక..మంగళగిరి నియోజకవర్గంలో ప్రధాన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నా చివరి శ్వాస వరకు రాజకీయాల్లో ఉంటానని వెనక్కి తిరిగి సినిమాలు చేసే అవకాశాలు ఉండవని తేల్చిపారేశారు.


అయితే ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ అమెరికా లో జరగబోతున్న 'తానా' సభలకు సడన్ గా వెళుతున్న సమయంలో ఇప్పుడు ఈ వార్త పొలిటికల్ సర్కిల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. అమెరికాలో ఉండే తెలుగువారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'తానా' సభలకు మొట్టమొదటిగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే చీఫ్ గెస్ట్ గా ఆహ్వానిస్తామని నిర్వాహకులు అనుకున్నారు.


కానీ చంద్రబాబు ఓడిపోవడంతో తానా సభ నిర్వాహకులు పవన్ కళ్యాణ్ ను ఒప్పించి, రప్పించే బాధ్యతను తెలుగునాట ఓ మీడియా ఛానెల్ అధిపతికి అప్పగించినట్లు, ఆయనే దగ్గర వుండి పవన్ ను తోడ్కోని తీసుకువెళ్తారని కూడా వినిపిస్తోంది. పవన్ కు ఆ మీడియా ఛానెల్ అధిపతికి చిరకాలంగా మంచి సంబంధాలే వున్నాయి. అప్పట్లో పవన్ కు ఓ ఖరీదైన కారు కూడా బహుబతిగా ఇచ్చారని వార్తలు వచ్చాయి. దీంతో ఆ మీడియా అధినేత తో ఉన్న సత్సంబంధాలు చెడిపోకుండా ఉండడానికి అడిగిన మాట కాదనలేక పవన్ కళ్యాణ్  'తానా' సభలకు వెళ్తున్నట్లు ఇండస్ట్రీ లో పొలిటికల్ వర్గాల్లో టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: