పవన్ కళ్యాణ్ జరిగిన ఎన్నికలలో ఘోరంగా ఓడిపోవడంతో చాలా మంది మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ ని ప్రేమించే ప్రతి ఒక్కరు బాధ పడ్డారు. జరిగిన ఎన్నికలలో టీడీపీ వైసీపీ వంటి పార్టీలకు దీటుగా తాను స్థాపించిన జనసేన పార్టీ సామాన్యులకు దగ్గరగా తీసుకెళ్ళే ప్రయత్నం చేసి పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి తన జీవితంలో అసెంబ్లీకి రెండు నియోజకవర్గాల తరపునుండి పోటీచేసిన సమయంలో రెండు చోట్లా ఓడిపోవడంతో అందరూ షాక్ తిన్నారు.

ఇటువంటి సమయములో పార్టీని ముందుకు నడిపించాలంటే కచ్చితంగా పవన్ కళ్యాణ్ సినిమాలు చెయ్యాలని ఒకపక్క వార్తలు వస్తుంటే మరో పక్క పవన్ కళ్యాణ్ ఒక్కసారి సినిమాలు మానేసి వెనక్కి వచ్చాక తిరిగి వెనక్కి తిరిగి ప్రసక్తి లేదని తన శేష జీవితం మొత్తం ప్రజా పోరాటాలకు అంకితం అని దెబ్బతిన్న కానీ పైకి లేచే వ్యక్తిని అంటూ సినిమాలు చేయను ఖరాఖండిగా చెప్పేసాడు. అయితే ప్రస్తుతం ఇదే తరహాలో పవన్ కళ్యాణ్ వైఖరి కొనసాగిస్తే పార్టీలో నాయకులు ఒక్కొక్కరు బయటకు వెళ్ళి పోవడం ఖాయమని భవిష్యత్తు లేని పార్టీలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేరడం కష్టమని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.

ఒకవేళ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఇదేవిధంగా మూసివేస్తే మాత్రం ప్రజారాజ్యం పార్టీ కంటే దారుణంగా జనసేన పార్టీ పై బురద పడుతుందని మరికొంతమంది పొలిటికల్ లీడర్లు జనసేన పార్టీ పై పవన్ కళ్యాణ్ ఫై వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా జనసేన పార్టీ భవిష్యత్తు రాజకీయాల్లో రాణించాలంటే ఒక పక్క ఐదు సంవత్సరాలు సినిమాలు చేస్తూ మరో పక్క పవన్కళ్యాణ్ ప్రజల తరఫున పోరాటాలు చేయాలని అప్పుడే జనసేన పార్టీకి భవిష్యత్తు ఉంటుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: