టాలీవుడ్ లోకి కమెడియన్ గా తన సత్తా చాటిన సునీల్ ‘అందాల రాముడు’సినిమాతో కామెడీ హీరోగా యూటర్న్ తీసుకున్నాడు.  అప్పటి నుంచి వరుసగా కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన సునీల్ మొదట్లో మంచి హిట్స్ వచ్చినా, తర్వాత వరుస డిజాస్టర్స్ తో సతమతమయ్యాడు. ఇక లాభం లేదనుకొని తిరిగి కమెడియన్ గా నటించేందుకు సిద్దమయ్యారు.  ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు కమెడియన్ గా రాణించాలనుకుంటున్నారట సునీల్.  తాజాగా సముద్ర డైరెక్షన్ లో వి.సాయి అరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ‘జైసేన’ మూవీలో నటిస్తున్నారు సునీల్.  


ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌, మోషన్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే ఈ సినిమా టీజర్‌ను ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ రిలీజ్‌ చేశారు. తాాజాగా ఈ సినిమా టీజర్‌ను ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ రిలీజ్‌ చేశారు. ఇక టీజర్ పరంగా చూస్తుంటే సునీల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.  ఓ వైపు కామెడీ పండిస్తూనే మరోవైపు యాక్షన్ తో దుమ్ముదుళిపేస్తున్నాడు.  


తాజాగా ఈ మూవీ టీజర్ గురించి గోపిచంద్ మాట్లాడుతూ..సముద్ర  డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘జైసేన’ టీజర్‌  చాలా బాగుంది. ఈ సినిమాలో సునీల్‌ కామెడీ, యాక్షన్ సీన్లు చాలా బాగా నచ్చాయి.  ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధించాలని, సముద్ర ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

కో-ప్రొడ్యూసర్‌ పి.శిరీష్‌రెడ్డి మాట్లాడుతూ...ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్యాచ్‌వర్క్‌ జరుగుతోంది. నాలుగు రోజుల్లో పూర్తవుతుంది. త్వరలోనే రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం అన్నారు.

దర్శకుడు సముద్ర మాట్లాడుతూ... గోపీచంద్‌ చేతులమీదుగా మా సినిమా టీజర్‌ విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో శ్రీకాంత్‌, సునీల్‌ క్యారెక్టర్స్‌ చాలా హైలైట్‌గా నిలుస్తాయని అన్నారు. 

శ్రీకాంత్‌, సునీల్‌, శ్రీ, పృథ్వి, ప్రవీణ్‌, కార్తికేయ, అభిరామ్‌, హరీష్‌ గౌతమ్‌, అజయ్‌ ఘోష్‌, మధు, ఆజాద్‌, ధనరాజ్‌, వేణు, చమ్మక్‌ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: తిరుమల శెట్టి సుమన్‌, పార్వతిచందు, పాటలు: అభినయ్‌ శ్రీను, సిరాశ్రీ, సంగీతం: రవిశంకర్‌, డ్యాన్స్‌: అమ్మారాజశేఖర్‌, అజయ్‌, ఫైట్స్‌: కనల్‌ కన్నన్‌, నందు, రవివర్మ, కెమెరా: వాసు, కో ప్రొడ్యూసర్స్‌: పి.శిరీష్‌ రెడ్డి, దేవినేని శ్రీనివాస్‌, నిర్మాత: వి.సాయి అరుణ్‌ కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: వి.సముద్ర.


మరింత సమాచారం తెలుసుకోండి: