యాంగ్రీ యంగ్ మాన్ డాక్టర్ రాజశేఖర్, జీవిత కూతురు శివాత్మిక ప్రధాన పాత్రధారిగా దర్శకుడు కేవీఆర్ మహేంద్ర 'దొరసాని' సినిమాను రూపొందించాడు. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తిచేసుకొని గ్రాండ్ రిలీజ్ కి సిద్దం అవుతుంది. ఈ మూవీతో దర్శకుడిగా కె.వి.ఆర్ మహేంద్ర పరిచయం అవుతున్నాడు. 

80వ దశకంలో తెలంగాణలోని ఓ 'గడీ'కి చెందిన అమ్మాయిని, ఓ సాధారణ యువకుడు ప్రేమించడం, దాని పర్యవసానాలతో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాను వచ్చేనెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. అదే రోజున 'ఇస్మార్ట్ శంకర్' ఉండటంతో, 'దొరసాని' టీమ్ టెన్షన్ పడింది. ఎందుకంటే పూరి - రామ్ కాంబినేషన్ కి గల క్రేజ్ వేరు. 

తాజాగా ఈ సినిమా వచ్చేనెల 18వ తేదీకి విడుదలను వాయిదా వేసుకుంది.  దాంతో ‘దొరసాని’కి లైన్ క్లీయర్ అయ్యింది. అయితే 'దొరసాని' రోజునే సందీప్ కిషన్ 'నిను వీడని నీడను నేనే' ఉన్నప్పటికీ పెద్దగా ఎఫెక్ట్ పడదని నిర్మాతలు భావిస్తున్నారు.  ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతోన్న ఈ మూవీలో కన్నడ కిశోర్, వినయ్ వర్మ, ‘ఫిదా’ శరణ్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: