బాలీవుడ్ లో కబీర్ సింగ్ రిలీజైంది. అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాని అక్కడి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఆసక్తి టాలీవుడ్ లో కూడా నెలకొంది. ఈ వారం థియేటర్లలోకి వచ్చిన కబీర్ సింగ్ కు మిక్స్ డ్ రిజల్ట్ వచ్చింది. కొంతమంది సినిమా చెత్తగా ఉందని కూడా కామెంట్ చేస్తే, మరికొంతమంది మాత్రం అద్భుతంగా ఉందని మెచ్చుకుంటున్నారు. నిజానికి ఇలాంటి టాక్ ను కబీర్ సింగ్ యూనిట్ ముందే ఊహించింది. 


ఎందుకంటే అర్జున్ రెడ్డి రిలీజైన మొదటి రోజు కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి టాక్ వచ్చిందన్న విషయం అందరికి తెలిసిందే. అర్జున్ రెడ్డి రిలీజైన మొదటి రోజు, మొదటి ఆట పూర్తయ్యేసరికి సినిమా మరీ బోల్డ్ గా ఉందన్నారు చాలామంది. సినిమా రన్ టైం ఎక్కువైందన్నారు మరికొంతమంది. ఇలాంటి సినిమాలు ఆడవని చాలామంది క్రిటిక్స్ కూడా వాళ్ళకు తోచినట్టు మాట్లాడారు. కట్ చేస్తే, అర్జున్ రెడ్డి కల్ట్ మూవీగా నిలిచింది. ఇప్పుడు బాలీవుడ్ లో కబీర్ సింగ్ కూడా అదే స్టేటస్ అందుకుంటుందని యూనిట్ ఎంతో ధీమాగా ఉంది. 


మొదటి రోజు వచ్చిన స్పందనను పెద్దగా పట్టించుకోవడం లేదు. వీకెండ్ గడిచేసరికి సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. రీసెంట్ గా బాలీవుడ్‌లో వచ్చిన అజయ్ దేవగన్ దేదే ప్యార్ దే సినిమాకు కూడా ఇలానే విడుదలైన రోజు ఫ్లాప్ అన్నారు. కట్ చేస్తే, వీకెండ్ నాటికి సినిమా పుంజుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్ ప్రకారం, కబీర్ సింగ్ కూడా అదే విధంగా నిలదొక్కుకుంటుందని యూనిట్ నమ్మకం. సినిమా బాగాలేదంటూ వచ్చిన రివ్యూలు నిజమౌతాయా లేక యూనిట్ నమ్మకం నిజమౌతుందా తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: