ప్రభాస్ అసలు స్టామినా ఎంటో ఇంకొద్ది రోజుల్లో తెలియనుంది. ఎందుకంటే 'సాహో' సినిమాకి రెండు వందల అరవై అయిదు కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరుగుతోందని అంచనా. బాహుబలి 2 సక్సస్ తో ఈ సినిమాని భారీ రేట్లకి విక్రయిస్తున్నారు. బాహుబలి తర్వాత ఇండియాలో ఇంత మొత్తానికి అమ్ముడయిన సినిమా సాహో అని లేటెస్ట్ అప్‌డేట్. ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే నూట ఇరవై కోట్ల బిజినెస్‌ జరుగుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు.


ఇతర రాష్ట్రాలలోను మంచి బిజినెస్‌ జరిగిందని సమాచారం. ప్రతి ఒక్కరూ బాహుబలి 2 మాదిరిగా సాహో కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో కొనేస్తున్నట్టున్నారు. అయితే బాహుబలి 2 స్థాయిలో సాహోకి క్రేజ్‌ వుందా? వుంటే ఆ అంచనాలని ఈ సినిమా అందుకోగలదా? బాహుబలి తర్వాత చేసే సినిమా ఆ స్థాయికి తగ్గకూడదనే నిర్మాతల ప్రయత్నం అయితే సక్సస్ అయింది.


అంతేకాదు సాహో సినిమాకి పాన్‌ ఇండియా క్రేజ్‌ దక్కింది. ఇతర భాషలలోను ఈ సినిమాతో పోటీ పడడానికి సూపర్ స్టార్స్ సైతం కంగారు పడే పరిస్థితి నెలకొందంటేనే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది పూర్తిగా ప్రభాస్‌ క్రేజేనా లేక బాహుబలి ఆఫ్టర్‌ ఎఫెక్టా అనేది కూడా సాహోతో తేలిపోతుంది. ఈ సినిమాతో ప్రభాస్‌ స్టామినా ఏంటనేది ఇప్పటికే తెలిసిపోయింది. ఇక ఆ అంచనాలకి తగ్గట్టు విజయం దక్కితే మాత్రం ప్రభాస్‌కి ఎదురే లేదని ఒప్పుకోవాలి. మరి సాహో ప్రభాస్ కెరీర్‌ను ఎక్కడికి తీసుకెళ్ళనుందో ఆగస్ట్ 15 వరకు వేచి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: