దిల్ రాజు అంటే సక్సెస్ ఫుల్ నిర్మాత. పెద్దా చిన్నా సినిమాలతో ఎపుడు ఇండస్ట్రీ కళకళలాడాలని కోరుకునే అరుదైన నిర్మాత. ఎక్కువగా సక్సెస్ ఫుల్  మూవీస్ తీసిన  దిల్ రాజు ఇప్పటికీ విక్టరీకి కేరాఫ్ అడ్రస్ గా ఉన్నారు. ఆయన టాలీవుడో టాప్ ప్లేస్ ప్రోడ్యూసర్. మరి అటువంటి దిల్ రాజుని కీలకమైన పదవికి జగన్ ఎంపిక చేయనున్నారా.

 

అంటే అవుననే సమాధానం వస్తోంది. దిల్ రాజు టీడీపీ బోర్డ్ మెంబర్ గా నియమితులవుతారని ప్రచారంలో ఉంది. ఆయన జగన్ కి అటు కేటీయార్ కి సన్నిహితులు. పైగా చిత్తూరు జిల్లా వైసీపీ నేతతో ఆయనకు వియ్యం కూడా ఉంది. మరో వైపు వెంకటేశ్వరస్వామి వారి భక్తుడు ఆయన. ఇన్నీ కలసి ఆయనకు ఈ కీలకమైన పదవికి అర్హున్ని చేస్తున్నాయి.

 

ఇక జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన దిల్ రాజు, టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రమాణానికి కూడా వచ్చారు. దాంతో దిల్ రాజు నియామకం ఖాయమన్న మాట గట్టిగా వినిపిస్తోంది. వెంకటేశ్వరస్వామి ఆలయం కట్టించిన దిల్ రాజు తన బ్యానర్ పేరు కూడా ఆ స్వామి పేరు మీదే పెట్టుకున్నారు. అచ్చమైన భక్తుడిగా ఉన్న దిల్ రాజుకు ఆ పదవి ఇవ్వడం సబబే అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: