ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో ఇప్పుడు చరణ్ ఎక్కడ ఉన్నాడు అంటూ గుసగుసలు హడావిడి చేస్తున్నాయి. వాస్తవానికి ఇలాంటి వార్తలు హడావిడి చేయడానికి ఒక కారణం కనిపిస్తోంది. అల్లు అరవింద్ పెద్దకొడుకు బాబి పెళ్ళిలో మెగా ఫ్యామిలీ సభ్యులు అంతా కనిపించినా చరణ్ ఉపాసనలు కనిపించలేదు. 

దీనితో వీరు ఆఫ్రికాలోని టాంజానియాలోనే ఇంకా సమ్మర్ వెకేషన్ ను కొనసాగిస్తున్నారా లేదంటే వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లు చూడటానికి లండన్ వెళ్ళారా అంటూ ఆ పెళ్ళి ఫోటోలను చూసిన వారికి సందేహాలు కలిగినట్లు టాక్. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు చరణ్ ఉపాసనతో కలిసి ఇప్పుడు అమెరికాలో ఉంటూ ఒక థెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం. 
ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ లో చరణ్ కాలికి గాయం అయిన తరువాత ఆ గాయం పూర్తిగా తగ్గిపోయినప్పటికీ గత కొద్ది వారాలుగా చరణ్ లావు ఎక్కడమే కాకుండా ఆ పెరిగిన శరీరంతో చరణ్ కొంత అసౌకర్యానికి గురి అవుతున్నట్లు టాక్. దీనితో తనకు అనుకోకుండా పెరుగుతున్న ఆ శరీర లావును ముందుగానే కంట్రోల్ లో పెట్టుకోవడానికి అమెరికాలోని ఒక ప్రముఖ వైద్య సంస్థ నిర్వహిస్తున్న వెయిట్ లాస్ సెషన్ కు చరణ్ వెళ్ళినట్లు తెలుస్తోంది. 

కొద్దిరోజులు ఈ వెయిట్ లాస్ సెషన్ లో నిపుణులు చెప్పిన విధంగా జాగ్రత్తలు పాటించి ఆతరువాత చరణ్ ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు వస్తాడని టాక్. ఈ లోగ ‘ఆర్ ఆర్ ఆర్’ షెడ్యూల్ కు సంబంధించి జూనియర్ పై సన్నివేశాలు రాజమౌళి తీస్తూ చరణ్ గురించి వెయిట్ చేస్తారు అని అంటున్నారు. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ లో బయటకు చెప్పలేని అనేక మార్పులు చోటు చేసుకుంటున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: