ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో ఎక్కడ చూసినా ‘అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్ సింగ్' గురించి చర్చలు కనిపిస్తున్నాయి. ఈసినిమా మొదటిరోజు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ లో దుమ్ము దులిపినా విమర్శకులు మాత్రం ఈమూవీ పై విపరీతమైన విమర్శలు చేస్తూ భయంకరమైన  నెగెటివ్ రేటింగ్స్ ఇచ్చారు.

అంతేకాదు ఈసినిమాలో చాలలోపాలు ఉన్నాయని హీరో క్యారెక్టర్ లో నెగెటివ్ షేడ్స్ సమాజం పై ప్రభావం చూపిస్తుందని ముఖ్యంగా యువత నైతిక విలువల పతానానికి ఈ సినిమా మరింత సహకరిస్తుందని బాలీవుడ్ మీడియా అభిప్రాయపడుతోంది. అంతేకాదు చాలామంది బాలీవుడ్ విమర్శకులు 'అర్జున్ రెడ్డి' ని బ్లాక్ బస్టర్ చేసిన తెలుగు ఆడియన్స్ పై కూడా విరచుకు పడుతున్నారు. 

దీనితో తెలుగు ప్రేక్షకుల అభిరుచి పై బాలీవుడ్ మీడియాలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. జరుగుతున్న పరిణామాలను పరిశీలించిన యంగ్ హీరో సందీప్ కిషన్ కు విపరీతమైన కోపం వచ్చింది. దీనితో ఈహీరో తన ట్విటర్ ద్వారా బాలీవుడ్ మీడియా పై మాటలదాడి మొదలుపెట్టాడు.  

"ఒక సినిమాను మీ వ్యక్తిగత అభిరుచిని బట్టి ఎలా ఉందో నిర్ణయించడం ఒకఎత్తు కానీ ఆ సినిమాను ఇష్టపడిన ప్రేక్షకులను ఎలాంటివారో నిర్ణయించడం మాత్రం ఓ పైత్యం.  నాకు అర్జున్ రెడ్డి సినిమా చాలా నచ్చింది. ఇప్పటికీ నాది అదే అభిప్రాయం.  ఈ విషయంలో నేను ఒక్కడినే కాదు. తెలుగు ఆడియన్స్ అందరూ ఒకటే" అంటూ ట్వీట్ చేసి తెలుగు ప్రేక్షకుల అభిరుచిని సమర్ధించాడు. ఒక సినిమాను బట్టి ఏకంగా తెలుగు ప్రేక్షకుల అభిరుచి దిగజారిపోయిందా అంటూ బాలీవుడ్ మీడియా చేస్తున్న ప్రచారం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే విషయం..


మరింత సమాచారం తెలుసుకోండి: