విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన ‘సిందుబాద్‌’ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు అంజలి. శుక్రవారం తెరపైకి రావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. దీంతో శనివారం విడుదలయ్యే అవకాశముందని సమాచారం.

 

ఈ నేపథ్యంలో సినిమా గురించి ఆమె మాట్లాడుతూ.. ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి చాలా అద్భుతంగా నటించారు. ప్రతి సినిమాకు ఆయన నటనలో వైవిధ్యాన్ని కనబరుస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో రెండు, తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నా.

 

బాలీవుడ్‌ చిత్రాల్లో నటించాలనే ఆశ లేదు. తమిళం, తెలుగులో తెలిసిన వారితోనే నటించాలని అనిపిస్తోంది. రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేదు. నాకు తెలిసిన సినిమా రంగంలో గుర్తింపు తెచ్చుకుంటే చాలు.

 

పెళ్లి గురించి ఆలోచించలేదు. ప్రస్తుతానికి సినిమా మాత్రమే నా ప్రపంచం అని పేర్కొన్నారు. తెలుగింటి నుండెల్లి, తమిళనాట అడుగిడి, మంచి పేరే సంపాదించింది అంజలి. ఇలా తెలుగు నుండెల్లి, వేరే భాషలో పేరుసంపాదించే వాళ్ళు అతి కొద్దిమంది మనకు కనిపిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: