బాలీవుడ్ బాద్‌షా షారూక్‌ఖాన్ సినిమాలేవీ అంగీక‌రించ‌డం లేదు. `జీరో` సినిమా త‌ర్వాత షారూక్ క‌థ‌లు వింటున్నారు కానీ.. ఏ సినిమాకు కూడా గ్రీన సిగ్న‌ల్ ఇవ్వ‌లేద‌ట‌. ఈ విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న చెప్పారు.

 

రాకేశ్ శ‌ర్మ బ‌యోపిక్ `సారే జ‌హాసే అచ్చా`, `డాన్ 3` సినిమాల్లో షారూక్ న‌టిస్తార‌ని వార్త‌లు వినిపించాయి. ఈ త‌రుణంలో ఆయ‌న త‌న ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడారు.

 

తాను ఏ సినిమా చేయ‌లేద‌ని, కొన్ని రోజుల వ‌ర‌కు సినిమాలు చేయ‌కూడ‌ద‌ని అనుకుంటునట్లు తెలిపారాయ‌న‌. వ‌రుస సినిమాలు చేస్తూ వ‌చ్చిన త‌న‌కు కుటుంబంతో గ‌డిపే స‌మ‌యం దొర‌క‌లేద‌ని, పిల్ల‌లు ఎదుగుతున్నారు.

 

వారితో స‌మ‌యాన్ని గ‌డ‌ప‌క‌పోతే ఎలా? అందుక‌నే కొన్నిరోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్నాన‌ని అన్నారు. అలాగే ఖాళీ స‌మ‌యాల్లో పుస్త‌కాలు చ‌దువుతున్నాన‌ని కూడా అన్నారాయ‌న‌.


మరింత సమాచారం తెలుసుకోండి: