టాలీవుడ్‌లో రాం గోపాల్ వర్మ డెబ్యూ ఫిల్మ్ శివ సినిమా తర్వాత దాదాపు 30 ఏళ్ళకి అర్జున్ రెడ్డి మళ్ళీ అంతటి సంచలనాన్ని క్రియోట్ చేసింది. ఫస్ట్ డే డివైడ్ టాక్ వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసింది. దాంతో ఈ సినిమాని హిందీ, తమిళంలో నిర్మించడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపించారు. అందులో భాగంగానే హిందీలో అదే దర్శకుడిగా షాహిద్ కపూర్, కియారా అద్వాని జంటగా తెరకెక్కించారు. ఇక తమిళంలో చియాన్ విక్రం కొడుకుతో రూపొందిస్తున్నారు. అయితే తమిళంలో కంటే కూడా హిందీ కబీర్ సింగ్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.


ఇన్ని భారీ అంచనాల మధ్య విడుదలైన కబీర్ సింగ్ ప్రేక్షకుల పాజిటివ్ రెస్పాన్స్ మధ్య మొదటి రోజు ఏకంగా 20 కోట్ల వసూళ్లు సాధించింది. ఇది గత ఏడాది వచ్చిన పద్మావత్ కంటే రెండు కోట్లు ఎక్కువ. అందులోనూ పద్మావత్ వివాదాలను ఆధారంగా చేసుకుని దీపికా పదుకునే-సంజయ్ లీలా భన్సాలీ ఇమేజ్ మీద మార్కెట్ అయ్యింది. 
కాని కబీర్ సింగ్ కథ అలా కాదు. తెలుగు రీమేక్. అందులోనూ సందీప్ రెడ్డి వంగాకు బాలీవుడ్ లో డెబ్యు మూవీ. కేవలం కంటెంట్ ని ఆధారంగా చేసుకుని నిర్మాతలు హైప్ తీసుకురాగలిగారు. దాన్ని నిలబెట్టుకుంటూ యూత్ ని బాగా ఆకర్షిస్తున్న కబీర్ సింగ్ శనివారం కూడా 21 కోట్ల దాకా రాబట్టవచ్చని ట్రేడ్ టాక్. 


ఇక షాహిద్ సోలో హీరోగా ఇలాంటి ఓపెనింగ్స్ చూసి చాలా ఏళ్ళు అయ్యింది. అప్పుడెప్పుడో శాందార్ అనే సినిమాకు ఫస్ట్ డే మంచి  కలెక్షన్స్ వచ్చాయి ఆ తర్వాత అది నిలబడలేదు. కాని కబీర్ సింగ్ ఖచ్చితంగా ఈ ఏడాది టాప్ ఫైవ్ గ్రాసర్స్ లో నిలవడం ఖాయమని బాలీవుడ్ మీడియా లేటెస్ట్ న్యూస్. పద్మావత్ అన్ని హంగులు ఉంటేనే 19 కోట్ల మార్క్ చేరలేక ఫస్ట్ డేని ముగించింది. అలాంటిది కబీర్ సింగ్ లాంటి లవ్ స్టోరీ దాన్ని బ్రేక్ చేయడం అంటే మాటలా. హీరోయిన్ కీయరా అద్వాని తనకు దక్కిన ఫస్ట్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా ఇప్పటికే తన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఇంకో నాలుగు రోజులు అయ్యాక కబీర్ సింగ్ ఫైనల్ రేంజ్ ఏంటో క్లారిటీ వస్తుంది. మొత్తానికి అర్జున్ రెడ్డికి ఏమాత్రం తీసిపోలేదు హిందీ కబీర్ సింగ్.


మరింత సమాచారం తెలుసుకోండి: