వెబ్ ప్లాట్‌ఫారంపై వివిధ రకాల కార్యక్రమాలు రూపొందుతున్నాయి. తాజాగా హిట్టయిన సినిమాల ఆధారంగా వెబ్‌సిరీస్‌ను తీసుకువస్తున్నారు. ‘బాహుబలి’ సినిమా భారతీయ సినీ జగత్తులో సంచలనాలు నమోదు చేసిన విషయం విదితమే.

 

రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు మూడవ భాగం వెబ్ సిరీస్‌గా రూపొందుతోంది. దీనికి ‘బాహుబలి: బిఫోర్ ద బిగినింగ్’ అనే పేరు పెట్టారు. ఈ సిరీస్‌లో కీలకపాత్రను నటుడు అనూప్ సోని పోషించనున్నారు.

 

అనూప్ ఎనిమిదేళ్లపాటు ప్రసారమైన ‘క్రైమ్ పెట్రోల్’కు హోస్ట్‌గా వ్యవహరించారు. అలాగే ఇప్పటి వరకూ అనూప్ పలు రకాల పాత్రలు పోషించారు. ఈ చిత్రం ద్వారా అనూప్ వెబ్ సిరీస్‌లో కాలుమోపనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారంకానుంది. ఇది బాహుబలి-2కు ఫ్రీక్వల్‌గా రూపొందుతోంది.

 

బాహుబలి చిత్ర యూనిట్‌లో పనిచేసేనవారు ఈ వెబ్‌సిరీస్ కోసం పనిచేస్తున్నారని తెలిపారు. ఈ వెబ్‌సిరీస్‌లో అమరేంద్ర బాహుబలి తల్లిదండ్రులు కూడా కనిపించనున్నారు. మొత్తానికి ప్రపంచమ్మొత్తం ప్రభంజనం సృష్టించిన మన బాహుబలిని ఇప్పుడు వెబ్ సిరీస్ లో కూడా చూడొచ్చన్నమాట!


మరింత సమాచారం తెలుసుకోండి: