తెలుగునాట సంచ‌ల‌న విజ‌యం సాధించిన `అర్జున్‌రెడ్డి` రెడ్డి హిందీ రీమేక్ 'కబీర్ సింగ్' బాలీవులో హాట్ టాపిక్‌గా మారింది. విడుద‌లైన తొలిరోజే రికార్డు క‌లెక్ష‌న్లు సాధించిన ఈ సినిమాకు రివ్యూలు మాత్రం బాగా రాలేదు.

 

కొందరు రివ్యూయ‌ర్లు నెగెటివ్ రేటింగ్స్ ఇవ్వడమే కాకుండా హీరో క్యారెక్టరైజేష‌న్ సమాజంపై చెడు ప్రభావం చూపేలా ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అంతేకాదు `అర్జున్ రెడ్డి`ని విజ‌య‌వంతం చేసిన తెలుగు ప్రేక్ష‌కుల‌ను కూడా ఒక‌రు విమ‌ర్శించారు.

 

ఈ విమ‌ర్శ‌కు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిష‌న్ కౌంట‌ర్ ఇచ్చాడు. వ్యక్తిగత అభిరుచి మేర‌కు సినిమా ఎలా ఉందో నిర్ణయించడం ఒక ప‌ద్ధ‌తి. అయితే ఆ సినిమాను ఇష్టపడిన ప్రేక్షకులు ఎలాంటివారో నిర్ణయించడం మాత్రం అహంకారం.

 

నాకు `అర్జున్ రెడ్డి` సినిమా బాగా నచ్చింది. ఇప్పటికీ నా అభిప్రాయం అదే. ఈ విషయంలో నేనే కాదు.. తెలుగు ప్రేక్ష‌కులంద‌రూ ఒక‌టే` అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు తెలుగు నుంచి హిందీలోకి రీమేక్ అయి బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన‌ చిత్రాల లిస్టును కూడా పోస్ట్ చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: