స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ అన్నయ్య అల్లు వెంకటేష్ అలియాస్ బాబీ వివాహం హైద‌రాబాద్‌లో కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో చాలా నిరాడంబ‌రంగా జ‌రిగింది.  మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు మొత్తం ముగ్గురు కుమారులు. వీరిలో పెద్దవాడు అల్లు వెంకటేష్, రెండవవాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా రంగంలో స్టార్ హీరోగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక చిన్నవాడు అల్లు శిరీష్ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం బిజీగా ఉన్నారు.


ఇక వెంకటేష్ తండ్రికి సినీ నిర్మాణంలో సాయం చేస్తూ ఉంటాడు. వెంకటేష్ ఎక్కువగా పబ్లిక్ లో కానీ... మెగా హీరోల సినిమా ఫంక్షన్లలో కాని కనిపించడు. దీంతో అల్లు వెంకటేష్ గురించి బయటి ప్రపంచానికి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక వెంకటేష్ పదేళ్ల క్రితమే నీలిమ అనే మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. 


వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2016 లో ఈ జంట విడాకులు తీసుకుని విడిపోయారు. వెంక‌టేష్ కొంత కాలంగా పరిచయమున్న స్నేహితురాలైన ముంబైకి చెందిన నీలీషాను అల్లు వెంకటేష్ రెండో వివాహం చేసుకున్నారు. ఆ వివాహానికి సంబందించిన ఫోటోలు అల్లు వెంకటేష్ మీడియాతో పంచుకున్నారు. ఇక అన్న పెళ్లికి అల్లు అర్జున్ రాక‌పోవ‌డం ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 


అస‌లు మేట‌ర్ ఏంటంటే బ‌న్నీ ప్రస్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాను త్వ‌ర‌లోనే రిలీజ్ చేస్తున్నారు. షూటింగ్‌లో బిజీగా ఉండ‌డంతోనే బ‌న్నీ అన్న పెళ్లికి కూడా రాలేద‌ని తెలిసింది. అయితే పెళ్లికి త‌న భార్య స్నేహ‌ను పంపి... ఆ త‌ర్వాత అన్నా, వ‌దిన‌ల‌ను క‌లిసి శుభాకాంక్ష‌లు చెప్పాడ‌ట‌.


మరింత సమాచారం తెలుసుకోండి: