షాహిద్ కపూర్ నటించిన కబీర్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో కలెక్షన్స్ దండయాత్రతో దూసుకుపోతుంది. క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందన.. రివ్యూలు వచ్చాయి కానీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మాత్రం భారీగా ఉన్నాయి. మొదటి రోజు  దేశవ్యాప్తంగా 20.21 కోట్ల రూపాయలు సాధించిన 'కబీర్ సింగ్' జోరు రెండో రోజు కూడా కొనసాగింది. నిన్న ఇండియా వెర్సస్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఉండడంతో కలెక్షన్స్ తగ్గుతాయని చాలామంది అభిప్రాయపడ్డారు.


  కానీ ఆ మ్యాచ్ ప్రభావం కలెక్షన్స్ పై ఏమాత్రం కనపడలేదు. శనివారం నాడు 'కబీర్ సింగ్'  రూ. 22.71 కోట్లు సాధించిందని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.  దీంతో రెండు రెండు రోజుల కలెక్షన్ 42.92 కోట్లకు చేరింది. కబీర్ సింగ్ కలెక్షన్ల ఊపు చూస్తుంటే బ్లాక్ బస్టర్ దిశగా పయనించడం ఖాయమనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.  'అర్జున్ రెడ్డి' లైఫ్ టైమ్ కలెక్షన్స్ రూ.49 కోట్లు. 


ప్రస్తుతం 'కబీర్ సింగ్' జోరు చూస్తుంటే మూడో రోజునే ఈ మార్క్ దాటేయడం లాంఛనమే అని చెప్పవచ్చు.  అంతే కాకుండా షాహిద్ కపూర్ కెరీర్ లో సోలో హిట్స్ చూస్తే ఇంతవరకూ ఆ సినిమాలు 50 కోట్లు దాటలేదు.  దీంతో మూడో రోజు ముగిసే సమయానికి షాహిద్ కెరీర్లో 'కబీర్ సింగ్' హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచే అవకాశం ఉంది. ఈ బాక్స్ ఆఫీస్ రెస్పాన్స్ తో షాహిద్.. సందీప్ వంగా టీమ్ ఖుషీఖుషీగా ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: