కాశ్మీర్ లోయ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ లోయలో ఎప్పటి నుంచో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి.  అందాలకు నెలవైన ఈ లోయలో ప్రతినిత్యం ఘర్షణ వాతావరణం నెలకొని ఉంటోంది.  ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్యం తుపాకీ తూటాలా శబ్దం.  


బోఫోర్స్ తుపాకుల అలజడి.  ఇలా నిత్యం ఎదో ఒక యుద్ధం.  రావణ కాష్టం.  దీని నుంచి బయటపడేందుకు పాపం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  ఒక వినోదం లేదు.  ఒక సినిమా లేదు.  బాలీవుడ్ లో సినిమా పరిశ్రమ ఎంతగా అభివృద్ధి చెందుతున్నా, కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో సినిమాలు తీసుకుంటూ ఉన్నా.. అక్కడ మాత్రం సినిమా కనిపించదు.  


1989 నుంచి కాశ్మీర్ లో మల్టీప్లెక్స్ మూసివేశారు.  సాయంత్రం 6 దాటితే అంతా నిర్మాణుష్యమే.  యువతకు వినోదం లేకపోవడంతో.. ఉగ్రవాదం గురించి మాట్లాడుకుంటుంటారు.  ఉగ్రవాద కార్యకలాపాలు గురించి చర్చించుకుంటుంటారు.  


దీంతో అక్కడి యువత దోవ తప్పుతోంది.  దీనిపై దృష్టిపెట్టిన ప్రభుత్వం త్వరలోనే తిరిగి మల్టీప్లెక్స్ లను ఓపెన్ చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం.  ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నది.  ఇదే జరిగితే.. తిరిగి కాశ్మీర్ కు సినిమా కళ వచ్చినట్టే అవుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: