ఇటీవల బుల్లితెరపై ప్రదర్శితమైన బిగ్ బాస్ రెండు సీజన్లు మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. నిజానికి మొదట్లో ఈ షో ప్రారంభ సమయంలో, ఇటువంటి షోలకు మన ప్రేక్షకులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో అనే అనుమానం అందరిలోనూ ఉండేది. అయితే మెల్లగా షో ముందుకు నడుస్తున్నకొద్దీ వీక్షకులు కూడా ఈ షోకు బాగా కనెక్ట్ అవడం, అక్కడినుండి దానికి రేటింగ్స్ కూడా బాగా రావడం ప్రారంభమయింది. 

మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా అదరగొట్టగా, రెండవ సీజన్ కు హోస్ట్ గా వచ్చిన నాని, తనదైన శైలిలో షోను ముందుకు తీసుకెళ్లారు. ఇకపోతే అతిత్వరలో మూడవ సీజన్ కు సిద్ధం అవుతున్న బిగ్ బాస్ కు సంబంధించి ఇటీవల మరొక కొత్త ప్రోమోని విడుదల చేసింది స్టార్ మా యాజమాన్యం. అయితే ఆ ప్రోమోలో మొహం కనపడకుండా వ్యవహరించిన వ్యక్తి చాలావరకు అక్కినేని నాగార్జున అని, అయన సీజన్ 3కి హోస్ట్ గా రానున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే మరికొద్దిరోజుల్లో హోస్ట్ విషయమై బిగ్ బాస్ నిర్వాహకుల నుండి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ షోలో పాల్గొనే పార్టిసిపెంట్స్ లో ఇప్పటికే కొందరి పేర్లు సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 

ఇక నేడు మరొకరి పేరు బయటకు వచ్చింది. బుల్లితెరపై పలు షోలకు వ్యాఖ్యాతగా, అలానే కొన్ని సీరియల్స్ లో కూడా నటించిన ప్రముఖ యాంకర్ లాస్య ఇందులో ఒక పార్టిసిపెంట్ గా పాల్గొననుందని సమాచారం. ఇటీవల వివాహం చేసుకుని నటనకు దూరమైన లాస్య, ఈ షోతో అభిమానులను అలరించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఆమెతోపాటు మరికొందరి పేర్లు కూడా ప్రచారం అవుతున్నప్పటికీ, వారు అసలు ఈ సీజన్లో పాల్గొంటున్నవారేనా కాదా, అనేదానిపై షో నిర్వాహకుల నుండి ఎటువంటి ప్రకటన లేదు కనుక పూర్తిగా నమ్మెందుకు వీలు లేదు. ఒకవేళ బిగ్ బాస్ లో లాస్య పాల్గొంటే మాత్రం, అది ఆమె ఫ్యాన్స్ కు తీపి కబురు అనే చెప్పాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: