‘బాహుబలి’ తో  నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన రాజమౌళి తనకు ఏమాత్రం సమయం దొరికినా తన కుటుంబ సభ్యులతో రకరకాల కేఫ్ లకు బేకరీలకు వెళ్ళడం అతడి అలవాటు. అంతేకాదు ఆ బేకరీలో అదేవిధంగా ఆ కేఫ్ లలో ఉండే రకరకాల ఫుడ్ ఐటమ్స్ ను టేస్ట్ చేస్తూ సమయం గడపడం రాజమౌళి హాబి. 

ఈ అలవాటులో భాగంగా రాజమౌళి నిన్న జూబ్లీహిల్స్ లోని ఒక కాఫీ షాప్ కు అనుకోని అతిధిగా వచ్చి అక్కడ ఉండే రకరకాల ఫుడ్ ఐటమ్స్ ను టేస్ట్ చేయడమే కాకుండా ఆ ఫుడ్ ఐటమ్స్ ను ఫోటోలు తీస్తూ చాల సేపు కాలం గడిపారు. రాజమౌళితో అతడి భార్య కొడుకు కార్తికేయలతో పాటు మరికొంతమంది ఆ చాక్లెట్ కాఫీ బార్ అండ్ కేఫ్ కు వచ్చినట్లు తెలుస్తోంది. 

అనుకోని అతిధిగా రాజమౌళి ఆ కేఫ్ కు రాగానే అప్పటికే ఆ కేఫ్ లో ఉన్న కష్టమర్స్ లో సందడి వాతావరణం కనిపించడమే కాకుండా రాజమౌళికి షేక్ హ్యాండ్స్ ఇస్తూ సెల్ఫీలు తీసుకునే పని కూడ చేపట్టారు. ఎంతమంది తన చుట్టూ గుమిగూడినా వారందరితో రాజమౌళి నవ్వుతూ మాట్లాడుతూ కాలం గడపడం అక్కడకు చేరిన వాలందరికీ జోష్ ను ఇచ్చింది. 

ఈ హడావిడి ముగిసిన తరువాత రాజమౌళి తన కుటుంబ సభ్యులతో ఒక కార్నర్ టేబుల్ వద్ద కూర్చుని అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేయడమే కాకుండా ఆ కేఫ్ లో వినిపిస్తున్న పాత పాటలను ఎంజాయ్ చేసాడు. అంతేకాదు ఆ కేఫ్ విజటర్స్ బుక్ లో రాజమౌళి సంతకం చేయడమే కాకుండా అక్కడి కేఫ్ కిచన్ లోకి వెళ్లి కొద్దిసేపు అక్కడ కూడ సందడి చేసినట్లు తెలుస్తోంది. దీనితో ఆ కేఫ్ ఇప్పుడు రాజమౌళిలా సెలెబ్రెటీగా మారిపోయింది..     


మరింత సమాచారం తెలుసుకోండి: