సంగీత దర్శకుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి హీరోగా మారారు విజయ్ ఆంటోనీ. ప్రయోగాత్మక కథాంశాలతో తమిళ చిత్రసీమలో నటుడిగా వైవిధ్యతను చాటుకున్న ఆయన అనువాద చిత్రం బిచ్చగాడుతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. జయాపజయాలకు అతీతంగా ప్రతి సినిమాతో ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించడానికి తపిస్తుంటారాయన.

 

విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం కొలైగారన్‌తెలుగులో కిల్లర్ పేరుతో ఈ నెల 7న విడుదలవుతోంది. అండ్రూ లూయిస్ దర్శకుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రింది విధంగా వివిధ విషయాలగురించి ప్రస్తావించారు.

 

ఓ సీరియల్ కిల్లర్ కథ ఇది. అతడు వరుసగా హత్యలు చేయడానికి కారణమేమిటి? ఆ కిల్లర్ మంచివాడా?చెడ్డవాడా? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాం. గత సినిమాల్లో మాదిరిగా ఇందులో ఎలాంటి సందేశాన్ని చెప్పే ప్రయత్నం చేయలేదు. కుటుంబ విలువలతో సాగుతుంది.

 

నేను మంచి నటుడిని కాదు. నాకు పెద్దగా నటించడం రాదు. కాకతాళీయంగా హీరోనయ్యాను. బాగా నటించడానికి ఎల్ల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. నా దృక్కోణంలో అర్జున్ పరిపూర్ణ నటుడు. ఆయన నటన నన్ను బాగా ఆకట్టుకున్నది. పోలీస్ ఆఫీసర్‌గా ఆయన పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అని చాల సాదా సీదా గా (డౌన్ తో ఎర్త్) మాట్లాడారు.


మరింత సమాచారం తెలుసుకోండి: