బాలీవుడ్‌ కథానాయిక కరీనా కపూర్‌ ఖాన్‌, అమిర్‌ ఖాన్‌ కలసి గతంలో '3ఇడియట్స్‌', 'తలాష్‌' వంటి సినిమాల్లో నటించారు. తాజాగా మరోసారి మళ్లీ వెండితెరపై ఈ కాంబినేషన్‌ మెప్పించేందుకు సిద్ధమవుతుంది. 'లాల్‌ చంధ్‌ ' అనే చిత్రంలో వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

ఈ విషయాన్ని ఈ సినిమా యూనిట్‌ శనివారం వెల్లడించింది. 'సీక్రెట్‌ సూపర్‌స్టార్‌' ఫేమ్‌ అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అమిర్‌ ఖాన్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమా చేస్తున్నట్టు ఆయనే స్వయంగా గతంలో వెల్లడించారు.

 

హాలీవుడ్‌ రూపొందిన 'ఫారెస్ట్‌ గంప్‌' చిత్రానికి ఇది హిందీ రీమేక్‌. వియోకామ్‌ 18 స్టూడియోస్‌, అమిర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయి. వచ్చే ఏడాది క్రిస్మస్‌కి ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

ప్రస్తుతం కరీనా కపూర్‌ లండన్‌లో 'ఏంగ్రీజి మీడియం' చిత్రీకరణలో ఉన్నారు. ఈ చిత్రంతో పాటు అక్షరు కుమార్‌ హీరోగా చేస్తున్న 'గుడ్‌న్యూస్‌', 'తఖ్త్‌'లోనూ నటిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: