కథానాయికగా సౌత్లో 1980-90వ దశకంలో తిరుగులేని మహారాణిగా ఎదిగింది లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి. ఆమె సినిమాల్లో ఎంత సంచలనం సృష్టించిందో... రాజకీయ రంగ ప్రవేశం లోనూ అన్నే సంచలనాలు క్రియేట్ చేసింది. దక్షిణాదిలో అన్ని భాషల్లోనూ స్టార్ హీరోలకు ధీటుగా నటించిన విజయశాంతి లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. కథానాయికగా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఆమె రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. విజయశాంతి భర్త గురించి ఎప్పుడు పబ్లిక్ గా చెప్పిన దాఖలాలు లేవు.


అసలు విజయశాంతి భర్త గురించి చాలా మందికి తెలియదు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ఆమె భర్త శ్రీనివాస ప్రసాద్ అని మాత్రమే తెలుసు... అంతకు మించి వివరాలు లేవు. విజయశాంతి కూడా త‌న భ‌ర్త గురించి ఎప్పుడు పబ్లిక్ గా స్పందించలేదు. అయితే తన తాజా ఇంటర్వ్యూలో ఆమె భర్త గురించి ఇంకాస్త వివరంగా చెప్పడంతో పాటు తాను ఇంకా ఎందుకు పిల్లలను క‌న‌లేదో కూడా చెప్పింది. తనకు 17 ఏళ్ల వయసు ఉండగానే తండ్రి చనిపోయాడని... ఆ మరుసటి ఏడాది తల్లి కూడా కన్నుమూసిందని తెలిపారు.


ఇక తాను హీరోయిన్ గా ఎంతో స్టార్ రేంజ్ లో నిలదొక్కుకున్నా... కనీసం నిద్రపోయానా... తిండి తిన్నానా అన్న‌ది కూడా  ఎవరు పట్టించుకోలేదని... ఆ టైంలో నిర్మాత శ్రీనివాస ప్రసాద్‌తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకునే వరకు వెళ్ళింది అని ఆమె తెలిపింది. కర్తవ్యం ప్రొడక్షన్ లో శ్రీనివాస్ ప్రసాద్ తో ఏర్పడిన పరిచయం చివరకు తన జీవితాన్నే మార్చేస్తుందని... చాలా మంది హీరోయిన్ల వైవాహిక జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయని... కానీ తన భర్త మాత్రం చాలా మంచి వాడిని చెప్పుకొచ్చింది.


ఇక తన భ‌ర్త సింపుల్‌గా ఉండే వ్య‌క్తి అని... తాము 1988 మార్చి 29న రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నామని..  పెళ్లయ్యి 32 ఏళ్లయిందని.. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని బతుకుతున్నామని విజయశాంతి తెలిపింది. ఇక త‌న‌కు ప్ర‌జ‌లే పిల్ల‌ల‌ని చెప్పిన విజ‌య‌శాంతి.. పిల్ల‌లు ఉండే త‌న పిల్ల‌లు అన్న స్వార్థం పెరుగుతుంద‌ని.. అందుకే పిల్ల‌లు వ‌ద్ద‌నుకున్నాన‌ని చెప్ప‌డం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: