కోలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నడిఘర్ సంఘం ఎన్నికలు జరిగాయి.  టాలీవుడ్ లో గత కొంత కాలంగా మా అసోసియేష్ ఎన్నికల్లో ఎన్ని ఉత్కంఠ కొనసాగుతుందో ఇప్పుడు నడిఘర్ సంఘంలో కూడా అదే రేంజ్ లో టెన్షన్ వాతావరణం సంబవిస్తుంది. హీరో విశాల్ నడిఘర్ సంఘం ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే.  అప్పటి నుంచి ఆయనపై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తాయి.  చిన్న సినిమాల విషయంలో విశాల్ స్వార్థపూరిత ఆలోచనలు ఆలోచిస్తున్నారని..పెద్ద హీరోలకు వత్తాసు పలుకుతున్నారని..దాని వల్ల చిన్న నిర్మాతలు ఎంతో ఘోరంగా నష్టపోతున్నారని ఆరోపణలు వచ్చాయి.   

అంతే కాదు హీరో విశాల్ పై చిన్న నిర్మాతల సంఘం పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం..విశాల్ జైలుకు వెళ్లడం జరిగింది.  నేడు చెన్నైలో నడిఘర్ సంఘం ఎన్నికలు విశాల్ - భాగ్యరాజ్ వర్గాలు ఈ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డాయి. కొంత కాలంగా నడిఘర్ సంఘంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో  చాలా వరకు ఓటు వేయాల్సిన సినీ ప్రముఖులు ఈ ఎన్నికలకు దూరంగానే ఉన్నారు.

రజినీకాంత్ కూడా దర్బార్ షూటింగ్ కారణంగా ఓటు వేయడం కుదరలేదని ముందే వివరణ ఇవ్వగా మరికొంత మంది ఈ ఎన్నికలపై అసహనం వ్యక్తం చేశారు. విశాల్ మరోసారి అధ్యక్ష్య పదవిని అందుకుంటారా లేదా అనేది సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది.   పలు కేసుల విషయంలో విశాల్ మరికొంత మంది నడిఘర్ సంఘం ప్రముఖులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇక కోర్టు తీర్పు అనంతరం ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: