సీనియర్ నటి రమాప్రభ నాటి నేటి తరం హీరోల నుంచి నేటి యువతరం హీరోల వరకు ఎంతోమంది ఎన్నో వందల నాటకాలలో నటించింది. సినిమా, వ్యక్తిగత జీవితంలోని ఎత్తుపల్లాలను చవిచూసిన‌ ఆమె తన తాజా ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని సంచలన కామెంట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభం నుంచి తాను అతడిని గమనిస్తూనే ఉన్నాన‌ని... ఎన్టీఆర్ లో పెరిగిన మెచ్యూర్ లెవ‌ల్స్ చూస్తే తనకు ముచ్చటేస్తుందని రమాప్రభ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.


అయితే అదే టైంలో ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంపై ర‌మాప్ర‌భ‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాస్త సంచలనంగా మారాయి. చిన్న వయసులోనే సినిమాల్లోకి రావడంతో పాటు వరుస హిట్లతో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేయడంతో అతని పక్కన ఉండే వాళ్లు ఎన్టీఆర్‌ను మిస్‌లీడ్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కు కెరీర్ ఆరంభంలో ఎంత గర్వం ఉందో... ఇప్పుడు దానిని అంతే త్వరగా తగ్గించుకుని శిఖర స్థాయికి చేరుకున్న గొప్ప నటుడు అని రమాప్రభ కీర్తించారు.


ఇప్పుడు ఎన్టీఆర్ మాట్లాడుతుంటే మనం ఏదో తెలియని లోకంలోకి వెళ్లి పోతామ‌ని... ఎన్టీఆర్ కొన్ని విషయాలకు స్పందించే తీరు అద్భుతం అంటూ ప్రశంసించారు. చిన్న వయసులో వచ్చిన స్టార్ స్టేటస్  బ్యాలెన్స్ చేసుకోవడంలో ఎన్టీఆర్ కాస్త ఇబ్బంది పడినా... ఇప్పుడు దానిని సర్దుబాటు చేసుకుని చాలా ఉన్నత స్థితికి చేరుకున్నాడ‌ని ఆమె తెలిపారు. ఇక అశోక్ సినిమా టైం నుంచి ఎన్టీఆర్‌లో చాలా మార్పు ఉందని.. అతడి ప్రతి సినిమాకి మార్పు తాను గమనిస్తూనే ఉన్నాన‌ని ర‌మాప్ర‌భ తెలిపారు. ఏదేమైనా ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్‌లో అత‌డి వ్య‌క్తిత్వంపై ర‌మాప్ర‌భ మొత్తానికి ఓపెన్‌గానే త‌న అభిప్రాయం కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: