మజిలీ సూపర్ హిట్ తర్వాత నాగ చైతన్య వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ తో కలిసి వెంకీమామ సినిమా చేస్తున్న నాగ చైతన్య ఆ సినిమా తర్వాత బంగార్రాజు సినిమాలో కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. సోగ్గాడే చిన్ని నాయనా సీక్వల్ గా వస్తున్న బంగార్రాజు సినిమాలో నాగార్జున కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. 


ఇక ఇదే కాకుండా ఈమధ్యనే శేఖర్ కమ్ముల డైరక్షన్ లో సినిమా కన్ఫాం చేశాడు చైతు. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల కొత్త వాళ్లతో ఓ సినిమా చేస్తున్నాడని అన్నారు కాని సడెన్ గా చైతు సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చింది. ఇక్కడే చాలా కథ నడిచిందట. ముందు శేఖర్ కమ్ముల కొత్త వాళ్లతోనే తీద్దామని అనుకున్నాడట.  


ఆ సినిమా కోసం ఆడిషన్స్ చేశాడట. అయితే సినిమా కథలో హీరో బెస్ట్ డ్యాన్సర్ అట.. అందుకే పర్ఫెక్ట్ డ్యాన్సర్ కోసం వెతికారట. నిర్మాత డివివి దానయ్య కొడుకు హీరోగా ట్రై చేస్తుంటే అతన్ని కూడా ట్రై చేశాడట కాని లాభం లేక వదిలేశారట. ఎలాగోలా ఓ కుర్రాడిని ఫైనల్ చేస్తే అవుట్ పుట్ సరిగా రావడం లేదట. అందుకే ఆ కథతోనే చైతుతో సినిమా చేస్తున్నాడట.


మరి నాగ చైతన్య మంచి డ్యాన్సర్ కాదే అని డౌట్ రావొచ్చు.. చైతు దగ్గరకు వచ్చే సరికి సినిమా కథను మార్చేశాడట. చైతు కథలో హీరోయిన్ డ్యాన్సర్ గా చూపిస్తున్నారట. అందుకే ఫిదా భామ సాయి పల్లవిని సెలెక్ట్ చేశారు. డ్యాన్స్ లో దుమ్ము దులిపేసే రౌడీ బేబీ శేఖర్ కమ్ముల సినిమాతో మరోసారి అదరగొడుతుందని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: