డాన్ మూవీ అమితాబ్ కెరీర్‌లోనే ఎవ‌ర్ గ్రీన్ క్లాసిక్‌గా నిలుస్తుంది. ఈ మూవీకు రిమేక్‌ల‌ ప‌ర్వం కొన‌సాగిస్తున్న బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారుక్ కూడ అదే జోరును కొన‌సాగిస్తున్నాడు. షారుఖ్ న‌టించిన డాన్‌,డాన్‌2 మూవీలు బాక్సాపీస్ వ‌ద్ద రికార్డు క‌లెక్షన్స్‌ తెచ్చుకోగ‌లిగింది. 2006లో డాన్‌, 2011లోడాన్‌2 త‌రువాత ఇప్పటి వ‌ర‌కూ మ‌రో డాన్ సీక్వెల్ రెడీ కాలేదు.

ఇప్పుడు ఈ డాన్‌3 మూవీకు సంబంధించిన స్టోరి డిస్కష‌న్స్ మొద‌ల‌వుతున్నాయి. దీనికి సంబంధించిన అఫిషియ‌ల్ స్టేట్‌మెంట్‌ను ప్రొడ్యూజ‌ర్ ఫ‌రాన్ అక్తర్ వెల్లడించాడు. 'ఇప్పటి వ‌ర‌కూ మేము నిర్మించిన డాన్ సీక్వెల్స్ అన్ని ఫుల్ క‌లెక్షన్స్‌తో, స‌క్సెస్‌ను సాధించాయి. అలాగే ఇప్పుడు డాన్‌3 మూవీకు సంబంధించిన వ‌ర్క్‌ స్టార్ట్ అయింద‌ని' వివ‌రించాడు.

'డాన్‌3లో షారుఖ్ ఖాన్ గుజ‌రాతి డాన్‌గా క‌నిపిస్తున్నాడు. ఈ మూవీ 2014లో సెట్స్ మీద‌కు వెళుతుంది. రిలీజ్ కూడ అదే సంవత్సరంలో ఉండ‌వ‌చ్చు, ఒకవేళ లేటు అయితే 2015లో రిలీజ్ ఉండ‌వ‌చ్చు' అని చెప్పాడు. ఈ ప్రాజెక్ట్‌పై షారుఖ్‌ఖాన్ చాలా ఆస‌క్తి చూపుతున్నాడు. డాన్‌3 మూవీ త‌రువాత డాన్ సీక్వెల్స్‌ని ఆపేయాల‌ని షారుఖ్ బావిస్తున్నాడు. ఈ మూవీలో హీరోయిన్‌గా దీపికాప‌దుకొనె న‌టించే అవ‌కాశం ఉంద‌ని బాలీవుడ్ చెబుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: